తిరస్కరించిందనీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు...

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:56 IST)
తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ మహిళా పోలీసు అధికారిణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో కిరాతకుడు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, వల్లికున్నం పోలీస్ స్టేషన్‌లో సౌమ్య పుష్కరణ్ (31) అనే మహిళ పోలీసు అధికారిణిగా పని చేస్తోంది. 
 
ఈమె శనివారం తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అజాస్ కారులో వచ్చి ఆమె ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత లేచి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, కారుతో వెంబడించి, ఆ తర్వాత గొడ్డలితో నరికి, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తూ కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అజాద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు వద్ద జరిపిన విచారణలో... తమ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగిందనీ, అయితే, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, ఆమె అంగీకరించలేదని చెప్పారు. ఆ కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments