Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగాడివైతే బస్సు మీద చెయ్యేసి చూడు.. తాటతీస్తా ఏమనుకుంటున్నావో?

మగాడివైతే బస్సు మీద చెయ్యేసి చూడు.. తాటతీస్తా ఏమనుకుంటున్నావో?
, శనివారం, 5 జనవరి 2019 (16:17 IST)
సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశానికి నిరసనగా కేరళలో, తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ బస్సుపై దాడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను తమిళనాడు పోలీస్ తాట తీశాడు. ''మగాడివైతే బస్సు మీద చెయ్యేసి చూడమంటూ'' బెదిరించారు. ఈ వ్యవహారం తమిళ-కేరళ సరిహద్దు ప్రాంతమైన కలియక్కాకవిల్లైలో జరిగింది. 
 
అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. బస్సులను అడ్డుకున్నారు. అంతేగాకుండా ఆ బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నించారు. ఆ సమయంలో అక్కడకొచ్చిన సబ్ ఇన్‌స్పెక్టర్ మోహన్ అయ్యర్.. డ్రైవర్‌పై దాడి చేసేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 
 
''పెద్ద మగాళ్లా మీరు.. ఆందోళనలు చేయాలంటే.. దాడికి పాల్పడాలంటే.. ఇండో సరిహద్దుకు వెళ్లండి.. ఆటలా.. తాట తీస్తా'' అంటూ ఫైర్ అయ్యారు. ''మగాడివైతే.. ఆ బస్సును తాకి చూడు" అంటూ సవాల్ విసిరారు. దీంత బీజేపీ కార్యకర్తలు మిన్నకుండా ఆ ప్రాంతం నుంచి జారుకున్నారు. ఆపై కేరళ బస్సును సురక్షితంగా అక్కడ నుంచి మోహన్ అయ్యర్ తరలించారు.
 
ప్రస్తుతం మోహన్ అయ్యర్.. కేరళ బస్సుపై జరగాల్సిన దాడిని నిరోధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ కార్యకర్తలైనా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన మోహన్ ఐయర్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఆందోళనలను అడ్డుకున్న మోహన్ అయ్యర్‌ను కేరళ రవాణా శాఖ రూ.వెయ్యితో సత్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చారు: పవన్ కళ్యాణ్