Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పరీక్షలని కుమ్మేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:49 IST)
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలీసుల అత్యుత్సాహం చూపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడిని కరోనా పరీక్షల పేరుతో అదుపులోకి తీసుకుని ఆ యువకుడిని చిత్రహింసలు గురిచేశారని ఆ యువకుని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
 
దొరవారిసత్రం మండలం బురద గళ్లు గ్రామానికి చెందిన కండ్రిక వినోద్ అనే యువకుడు బెంగళూరు నుంచి రావడంతో గ్రామ వాలంటీరుకు సమాచారం ఇచ్చి అనంతరం వాళ్ల సలహా మేరకు దొరవారి సత్రం పోలీస్ స్టేషనుకి తీసుకెళ్లగా ఆ యువకునితో పాటు తల్లితండ్రులను సోదరుడిని అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం అక్కడే ఉంచి ఎంతకు వారిని పరీక్షలు చేయకపోవడంతో ఉదయం 10 గంటల నుండి వేచి ఉన్నా సరిగా పట్టించుకోలేదని పోలీసులను అడగడంతో పోలీసులకు చిర్రెత్తింది.
 
పోలీసుల లాఠీకి పని చెప్పారనీ, ఎంత అరిచి మొత్తుకున్నా వాళ్లని చిత్రహింసలకు గురిచేశారనీ, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ముట్టడించి వారిని విడిచి పెట్టాలని లేకుంటే పురుగు మందులు తాగి అక్కడే చస్తామని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
 
దొరవారిసత్రం ఎస్సై సుధాకర్రెడ్డి మహిళలను కూడా దుర్భాషలాడారని గతంలో ఇసుక తరలింపు విషయంలో గ్రామస్తులకి ఎస్సైకి మధ్య పాతకక్షలు ఉన్నాయని అదను కోసం ఎస్సై ఎదురుచూసి అవకాశం దొరికిందని యువకుడిని చిత్రహింసలకు చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments