Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో అధికారులు జులుం.. పన్ను కట్టలేదని ఇంటికి తాళం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (08:39 IST)
పిఠాపురం మున్సిపల్ అధికారులే స్వయంగా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంటి పన్ను కట్టలేదని తమ జులుం ప్రదర్శించారు. ఇంట్లో మహిళలు ఉండగానే ఇంటికి తాళం వేశారు. ఆ తర్వాత మహిళలు గొడవకు దిగడంతో సిబ్బంది వచ్చి ఇంటి తాళం తీశారు. మునిసిపల్ అధికారులు వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని, అదికూడా తమ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 
 
పిఠాపురం పట్టణంలోని మోహన్ నగరులో ఇంటి పన్ను వసూళ్లకు వెళ్ళిన మున్సిపల్ అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణల ఇంటికి తాళం వేశారు. పన్ను చెల్లించని కారణంగా వారిళ్ళకు తాళం వేసి నోటీసులు అంటించారు. ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. సత్తిబాబు ఇంట్లోని మహిళలు ఆందోళనకు దిగడంతో తాళాలు తొలగించారు. సత్తిబాబు ఇంటికి వేసిన సీలును మాత్రం అలానే ఉంచి వెళ్లిపోయారు. 
 
దీనిపై సత్తిబాబు మాట్లాడుతూ, సాధారణంగా తనకు ఎపుడూ రూ.1600 మాత్రమే ఇంటి పన్ను వచ్చేదన్నారు. కానీ ఈ దఫా రూ.6400 వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేందుకు తనకు గడువు ఇవ్వాలని కోరినా వారు ఏమాత్రం వినిపించుకోలేదని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments