Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హారర్ థ్రిల్లర్ మూవీ ది మాన్షన్ హౌస్ కాన్సెప్ట్ పోస్టర్

Advertiesment
The Mansion House concept poster
, మంగళవారం, 1 మార్చి 2022 (12:39 IST)
The Mansion House concept poster
హారర్ థిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'ది మాన్షన్ హౌస్'. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
 
నేడు (మార్చి 1) మహా శివరాత్రి కానుకగా 'ది మాన్షన్ హౌస్' కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. కేవలం బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. పెద్ద బంగ్లా, ఆ బంగ్లా మీద ఒక లేడీ, ఆకాశంలో ఎగురుతున్నట్లుగా మనుషుల రూపాలు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.  
 
తలారి వీరాంజనేయ సమర్పణలో శ్రీ హనుమాన్ ఆర్ట్స్ బ్యానర్‌పై హేమంత్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ది మాన్షన్ హౌస్' సినిమాకు BCV సత్య రాఘవేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సుశీల్ మెహర్, యష్ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా వృందా కృష్ణ ఫీమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
నటీనటులు: 
 సుశీల్ మెహర్, యష్, వృందా కృష్ణ, కమల్ తేజ నార్ల, షారుఖ్, రాజీవ్ సిద్దార్థ్, రాజ్ రాయల్, శ్రవణ్ భరత్, శామీర్ 
 
సాంకేతిక వర్గం:  బ్యానర్: శ్రీ హనుమాన్ ఆర్ట్స్, సమర్పణ: తలారి వీరాంజనేయ, ప్రొడ్యూసర్: BCV సత్య రాఘవేంద్ర, రైటర్, డైరెక్టర్: C హేమంత్ కార్తిక్, సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమీ, మ్యూజిక్: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారు వారి పాట నుంచి మహా శివరాత్రి పోస్టర్ వ‌చ్చేసింది