ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌజ్‌కి నీటిని తరలించేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మించారని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా వేలమంది పేదలు భూములు కోల్పోతున్నారని విమర్శించారు.
భూములను త్యాగం చేసిన రైతులను రీజినల్ రింగ్ రోడ్డు అంటూ మరోసారి వారిని మోసం చేయడానికి కేసీఆర్ సర్కారు పూనుకుందని అన్నారు. ఇక్కడ కోట్లు పలుకుతున్న ఎకరా భూమికి పరిహారంగా రూ. 10 లక్షలు ఇస్తారా... అంటూ ప్రశ్నించారు.
యాసంగిలో వరి వద్దు అని, వరి కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని ప్రజలే ఉరి తీస్తారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.