Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా బలమెంతో మాకు తెలుసు... తెలుగు రాష్ట్రాల్లో పోటీకి సై : పవన్ కళ్యాణ్

గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థ

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (11:58 IST)
గాంధీ జయంతి రోజున జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించనున్నట్టు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, ఇరు రాష్ట్రాల్లో తమ బలమెంతో తమకు తెలుసునని, బలమున్నంత మేరకే పోటీ చేస్తామన్నారు. అన్ని చోట్లా తమ అభ్యర్థులు ఉండబోరని స్పష్టం చేశారు. గెలుపు ఖాయమని భావించిన ప్రతి చోటా జనసేన అభ్యర్థి పోటీలో ఉంటాడని చెప్పారు. 
 
ఈ మేరకు పవన్ కల్యాణ్ తన 'జనసేన' పార్టీ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. "మన బలం 175 ఉంటే 175 పోటీ చేద్దాం. మన బలం ఎంతుంటే అంత, 175 స్థానాలకి తెలంగాణ సహా అన్నింటికీ పోటీ చేస్తాం. లేదా బలం లేదు. మన బలం ఎంతో అంతే చేస్తాం" అని క్యాప్షన్ పెట్టారు. ఈ మేరకు ఉదయం 9.57కు ఆయన ట్వీట్ పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. 
 
అయితే, ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో జనసేన పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అనేక నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం జరగలేదు. ఎన్నికల నాటికి ఈ నిర్మాణం పూర్తయి, విజయం సాధిస్తామన్న నమ్మకం కుదిరితే ఆ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments