Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా మదిలో పెళ్లి ఆలోచన మొదలైంది : రేణూ దేశాయ్

హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలైందట. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలో ఈ ఆలోచన వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

Advertiesment
నా మదిలో పెళ్లి ఆలోచన మొదలైంది : రేణూ దేశాయ్
, సోమవారం, 2 అక్టోబరు 2017 (11:47 IST)
హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలైందట. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలో ఈ ఆలోచన వచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ.... "ఏడాది క్రితం వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకంటూ ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందనిపించింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నాకు ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు మా అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
ఆ సమయంలో అనిపించింది. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని. ఆ ఇన్సిడెంట్‌కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం" అంటూ తన మనసులోని బాధను, భావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు సాగాల్సిందేనని ఆమె చెప్పుకొచ్చారు. జీవితంలో సింగిల్ ఉమన్‌గా ఉండటం కష్టమేనని... అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుందని, ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. అయినా... జీవితంలో జరిగిన విషయాలను మనం స్వీకరించి, ముందుకు సాగాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పవద్దనే విషయాన్ని తన తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించిందని, దాన్ని ఇప్పటికీ అనుసరిస్తున్నట్టు చెప్పారు. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నానని... ఏనాడూ అబద్ధం చెప్పలేదని అన్నారు. తన కుమారుడు అకీరా, తాను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటామని తెలిపారు. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుందన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ 'అర్జున్ రెడ్డి'గా విక్రమ్ వారసుడు