ఏం జరిగినా నా మీద పడి ఏడవడానికి రెడీగా వుంటారు.. పవన్

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:58 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడిని ఖండించినందుకు తనను విమర్శించడమేంటని ప్రశ్నించారు. ఏదో సామెత చెప్పినట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, ఆయన వర్గం తమ మీద పడి ఏడవడానికి రెడీగా ఉంటారని పవన్ మండిపడ్డారు.
 
కాగా జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై పవన్ స్పందించారు. దాడిని ఖండించిన పవన్ ఈ చర్య అమానుషమని తెలిపారు.  గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పవన్, కేసీఆర్, కేటీఆర్, గవర్నర్ నరసింహన్ తదితరులపై విరుచుకుపడ్డారు. 
 
తిత్లీ తుపానుతో శ్రీకాకుళం అతలాకుతలమైతే ఒక్క మాటా మాట్లాడని వీరంతా జగన్‌కు చిన్న గాయం తగలగానే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర కోణం కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై పవన్ మండిపడ్డారు. "ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు'' ఏం జరిగినా.. మా మీద పడి ఏడుస్తారెందుకు అని ప్రశ్నించారు.
 
మరోవైపు జగన్‌కు చికిత్స అందిస్తున్న హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు... ఆయనకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు గాయమైందని ప్రకటించారు. తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments