దర్శకుడు సుకుమార్.. సమంత వచ్చాక చైతూతో మాటల్లేవంటున్నాడు. సమంత వచ్చిన తరువాత చైతూ తనతో అంతగా మాట్లాడం లేదని సుకుమార్ చెప్పుకొచ్చారు. రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమాలను ఫిల్మ్ ఇండస్ట్రీకి అందజేసిన సుకుమార్ సమంతపై ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చందుమెుండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ నటించిన సవ్యసాచి చిత్రం ట్రైలర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలను తాను ఎప్పుడూ చేయలేదని, ఇప్పటివరకు ఇలాంటి భారతీయ సినిమా స్క్రీన్‌పై రాలేదన్నారు. తాను ఈ సినిమా చేయనందుకు తనకు అసూయగా వుందని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమా హీరో నాగచైతన్యను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ సినిమాలో చైతూ చాలా అద్భుతంగా నటించాడు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుందని చెప్పాడు. 100% లవ్ సినిమా తరువాత తాను, చైతూ తరచుగా కలిసేవాళ్లమని.. అయితే సమంత వచ్చిన తరువాత చైతూను కలవడం వీలుకాలేదని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.