Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవును.. నాకూ ఆ అనుభవం వుంది.. కానీ చెప్పుతో కొట్టా: ముంతాజ్

Advertiesment
Mumtaj
, మంగళవారం, 23 అక్టోబరు 2018 (11:16 IST)
దేశ వ్యాప్తంగా ''మీ టూ'' ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో సినీ తారలు తమకు ఎదురైన అనుభవాల గురించి నోరు విప్పుతున్నారు. ఇప్పటికే మీ టూ ఉద్యమంతో భారత విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పదవి ఊడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన ఐటమ్ గర్ల్ ముంతాజ్ కూడా మీ టూ స్పందించింది. ఇంకా పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాలో కనిపించిన ముంతాజ్  ఫేమ్ ముంతాజ్ తనకు సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపులను చెప్పుకొచ్చింది. 
 
ఈ సందర్భంగా ముంతాజ్ మాట్లాడుతూ.. తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. ఇలాంటి చేదు అనుభవాలు చాలానే వున్నాయని చెప్పుకొచ్చింది. ఓ దర్శకుడు సినిమా షూటింగ్ సందర్భంగా తనకు అసభ్యంగా ప్రవర్తించాడని.. అయితే తాను మిన్నకుండిపోలేదని.. వెంటనే చెప్పు తీసుకుని కొట్టానని తెలిపింది. ఈ వ్యవహారంపై నడిగర్ సంఘానికి వెంటనే ఫిర్యాదు చేశానని.. వాళ్లు జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించారని తెలిపింది. 
 
ఈ వివాదం గొడవగా మారినా అతడిలో మార్పు రాలేదని.. అప్పటికీ అతనిని బూతులు తిట్టానని.. ఆ తర్వాత నుంచి తన జోలికి రావటం మానేశాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఎప్పుడైనా కనిపిస్తే రండి మేడమ్.. కూర్చోండి మేడమ్.. ఏం తీసుకుంటారు? అని మర్యాదగా ప్రవర్తించేవాడని తెలిపింది. మీ టూ వ్యవహారంలో ఇద్దరి వాదనలు వినాలని ముంతాజ్ కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ‌న్నీ మూవీ ఫిక్స్... ఈసారి రీమేక్‌ని న‌మ్ముకున్నాడా..?