Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్.. 7729 పోస్టులు

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 7729 పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. టీఆర్‌టీ, టెట్‌ కమ్‌ టీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించి, నియామక ప్రక్రియ చేపడతారు. రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 7,729 టీచర్‌ పోస్టులను జిల్లా సెలెక్షన్‌ కమిటీ(డీఎస్సీ)ల ద్వారా భర్తీచేసేందుకు వీలుగా శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 
 
డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచారు. ఓసీ అభ్యర్థులకు 42 నుంచి 44 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 నుంచి 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 52 నుంచి 54 సంవత్సరాలకు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో డీఎస్సీ-2018 షెడ్యూల్‌ను విడుదల చేశారు. 
 
డీఎస్సీ షెడ్యూల్‌ వివరాలు
అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల
నవంబరు 1 నుంచి 15 వరకూ ఫీజు చెల్లింపు
నవంబరు 1 నుంచి 16 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
నవంబరు 1 నుంచి 12 వరకూ హెల్ప్‌డెస్క్‌ సర్వీసులు
నవంబరు19 నుంచి 24 వరకూ పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబరు 17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
నవంబరు 29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌
డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ (నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్షలు
11న స్కూల్‌ అసిస్టెంట్స్‌ (లాంగ్వేజెస్‌) రాత పరీక్షలు
12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాత పరీక్ష
14, 26 తేదీల్లో టీజీ టీచర్స్‌, ప్రిన్సిపాల్స్‌ రాతపరీక్ష
17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ రాత పరీక్షలు
27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాత పరీక్ష
28 నుంచి 2019 జనవరి 2 వరకూ ఎస్‌జీటీ రాత పరీక్ష. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments