Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్ విశ్వ‌విద్యాల‌య ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తాం: మంత్రి గంటా

అమ‌రావ‌తి: ఒక గ్రామంలో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఎవ‌రైనా చ‌దువుకునేలా వినూత్న ప‌థ‌కానికి సంబంధించిన స‌మ‌గ్ర నివేదికను ప‌రిశీలించి, దానికి అనుగుణంగానే ఆన్ లైన్ వ‌ర్శ‌టీ ఏర్పాటుపై సీఎంతో చ‌ర్చిస్తామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ర

ఆన్‌లైన్ విశ్వ‌విద్యాల‌య ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తాం: మంత్రి గంటా
, గురువారం, 19 జులై 2018 (21:35 IST)
అమ‌రావ‌తి: ఒక గ్రామంలో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఎవ‌రైనా చ‌దువుకునేలా వినూత్న ప‌థ‌కానికి సంబంధించిన స‌మ‌గ్ర నివేదికను ప‌రిశీలించి, దానికి అనుగుణంగానే ఆన్ లైన్ వ‌ర్శ‌టీ ఏర్పాటుపై  సీఎంతో చ‌ర్చిస్తామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న రాజీవ్ గాంధీ యూనివ‌ర్శ‌టీ ఆఫ్ టెక్నాల‌జీస్ (ఆర్జీయూకేటీ) చాన్స‌ల‌ర్ ప్రోఫెస‌ర్ రాజ్ రెడ్డికు హామీ ఇచ్చారు. 
 
విజ‌య‌వాడ‌లోని మంత్రి గంటా క్యాంప్ కార్యాల‌యంలో ఆర్జీయూకేటీ చాన్స‌ల‌ర్ మంత్రి గంటాను కలిసి నివేదిక అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై మంత్రి గంటా.. చాన్స‌ల‌ర్‌తో చర్చించారు. ఫ్యాక‌ల్టీలో కొంతమందిని ప‌ర్మినెంట్‌గా తీసుకోవాల‌న్న చాన్స‌ల‌ర్ విన‌తిపై మంత్రి సాన‌ుకూలంగా స్పందించారు. క‌నిగిరి దూబ‌గుంటలో ఏర్పాటు చేయ‌నున్న ట్రిపుల్ ఐటి భ‌వ‌న నిర్మాణాల‌కు శంకుస్థాప‌న అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఆర్జీయూకేటీ చాన్స‌ల‌ర్‌కు ప‌లు అంశాల‌పై మంత్రి గంటా శ్రీనివాస‌రావు సూచ‌న‌లు చేశారు.
 
పాత బ‌కాయిలు విడుద‌ల చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి గంటాకు చాన్స‌ల‌ర్  విన్న‌వించారు. ఒకే గ్రామం లేదా క్యాంప‌స్ లో  కేజీ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దువుకునే కొత్త విధానంపై  చాన్స‌ల‌ర్ వివ‌రించారు. ఈ ప‌థ‌కంపై స‌మ‌గ్ర నివేదిక‌ను మంత్రి గంటా కు అంద‌జేశారు. ఆన్ లైన్ లో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఎవ‌రైనా చ‌దువుకునే అవ‌కాశం వుంద‌ని, ఒక భ‌వ‌నంలో కేజీ నుంచి పీజీ వ‌ర‌కు విద్య‌న‌భ్య‌సించేలా ఏర్పాటు చేయ‌చ్చ‌ని తెలిపారు. వీటిని ఆన్ లైన్ విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేసి అనుసంధానించవ‌చ్చ‌ని వివ‌రించారు. స‌మ‌గ్ర నివేదిక‌పై సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి గంటా హామీ ఇచ్చారు. సీఎంతోనూ, క్యాబినెట్‌లోనూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు వెల్ల‌డించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లేటు వయసులో ఆరో బిడ్డ.. హేళన చేశారని గొంతుకోసి చంపేశారు..?