అధిక ఉష్ణోగ్రతలు... 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు: మంత్రి గంటా
అమరావతి: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా... 3 రోజుల పాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవ
అమరావతి: రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా... 3 రోజుల పాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు.
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల ఇస్తున్నామని చెప్పారు. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు వుంటాయని వాతవరణశాఖ హెచ్చరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సోమవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, వాతవరణశాఖ సూచనలు, హెచ్చరింపుల నేపథ్యంలో పాఠశాలలకు సెలవుల ప్రకటిస్తున్నామని మంత్రి గంటా తెలిపారు.
తప్పనిసరిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిందేనన్నారు. సెలవుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.