Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్యాబ్లెట్స్ ఓపెన్ చేస్తే అశ్లీల చిత్రాలు... వామ్మో అంటూ బెదిరిపోతున్న టీచర్లు...

టెక్నాలజీని సరిగా ఉపయోగించుకోకుంటే పలు అనార్థాలకు దారితీస్తుంది. అదే ఛత్తీస్‌గర్ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఓపెన్ చేయగానే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన మహిళా టీచర

ట్యాబ్లెట్స్ ఓపెన్ చేస్తే అశ్లీల చిత్రాలు... వామ్మో అంటూ బెదిరిపోతున్న టీచర్లు...
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:29 IST)
టెక్నాలజీని సరిగా ఉపయోగించుకోకుంటే పలు అనార్థాలకు దారితీస్తుంది. అదే ఛత్తీస్‌గర్ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఓపెన్ చేయగానే అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన మహిళా టీచర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు కోసం గత సంవత్సరం ట్యాబ్లెట్స్ సరఫరా చేసింది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. అయితే, రాయ్‌పూర్ జిల్లాలోని ఓ టీచర్ వీటి ద్వారా పోర్న్‌సైట్లను వీక్షించాడు. 
 
ఇక్కడ నుంచే అసలు సమస్య ఉత్పన్నమైంది. సదరు సైట్లను ఓపెన్ చేయడంతో వాటిలోని వైరస్ అన్ని ట్యాబ్లెట్లకు సోకింది. ఈ విషయం తెలియని ఇతర ఉపాధ్యాయులు ట్యాబ్లెట్స్‌ను ఓపెన్ చేయగానే అశ్లీల చిత్రాల పాప్అప్స్ రావడం మొదలుపెట్టాయి. 
 
ఈ అశ్లీల చిత్రాల నేపథ్యంలో ట్యాబ్లెట్లను వినియోగించేందుకు మహిళా టీచర్లు నిరాకరిస్తున్నారు. కనీసం బయోమెట్రిక్ ఇచ్చేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు. దీంతో సమస్యను పరిష్కరించేవరకూ ఈ ట్యాబ్లెట్స్‌ను వాడొద్దని రాయ్‌పూర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగివచ్చిన మోడీ సర్కారు.. సుప్రీంకోర్టుకు కేఎం జోసెఫ్