Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం క్యూలో పడిగాపులు.. నో అడ్మిషన్ బోర్డ్.. ఎక్కడ?

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (19:41 IST)
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు ప్రైవేటు పాఠశాలలోనే చదివించాలని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ నిరుపేదలు మాత్రం వేరే మార్గం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తుంటారు. ప్రతి యేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయి ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. 
 
కానీ అందుకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కొత్ల ఇండ్లులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పరిమితికి మించి చేరారు. ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గత సంవత్సరం 850 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించగా ఈ యేడాది ఏకంగా 1022 మంది చేరారు. 
 
చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం విద్యార్థులు వస్తూనే ఉండటంతో అడ్మిషన్లు ఆపేశారు. సీట్లు లేవంటూ పాఠశాల ముందు బ్యానర్ కూడా కట్టేశారు. పాఠశాలలో క్రమశిక్షణతో పాటు విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా నడుపుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నడుపుతుండటంతో  తల్లిదండ్రులు ఈ పాఠశాలలలోనే తమ పిల్లలను చేర్పించేందుకు పోటీలు పడుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments