Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!

ప్రియుడి మోజులో.. ఓ క‌న్న‌త‌ల్లి చేసిన దారుణం..!
, బుధవారం, 19 జూన్ 2019 (14:38 IST)
కన్న త‌ల్లి.. పిల్ల‌ల‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిందిపోయి.. ప్రియుడి మోజులో ప‌డి దారుణానికి ఒడిగ‌ట్టింది. వివ‌రాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని రామ‌వ‌రంలో ఓ మ‌హిళ తన సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకుంది. 
 
ఆ మహిళ.. భర్తలేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. అయితే.. వీరి సంబంధానికి అడ్డుగా ఉన్న తన ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ప్రియుడితో కలిసి ఆ తల్లి తన ఇద్దరు కూతుళ్లను చితకబాదింది. అంతటితో ఆగకుండా పిల్లలను ఒళ్ళంతా వాత‌లు పెట్టింది. 
 
ఈ విష‌యం స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సుఖం కోసం తన పిల్లలను స్వ‌యంగా తల్లే దారుణంగా చిత్రహింసలకు గురిచేయ‌డం అక్క‌డ ఉన్న వారిని క‌లిచివేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యూలో నిలబడమంటే.. రైల్వే పోలీసును చితక్కొట్టారు.. (Video)