కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో అక్రమ సంబంధాల లొల్లి... తలపట్టుకున్న సీఎం సాబ్!?

సోమవారం, 17 జూన్ 2019 (15:33 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్‌కు సొంత ఫామ్‌హౌస్ ఉంది. ఎర్రవల్లిలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిలో ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీ అధినేతగా ఉంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి నుంచి సేదతీరేందుకు ఆయన తన ఫామ్‌హౌస్‌కు వెళుతుంటారు. అయితే, ఫామ్‌హౌస్‌లో ఆయనకు సరికొత్త తలనొప్పి వచ్చింది. ఇక్కడ పని చేసే కూలీలు మధ్య వివాహేతర సంబంధాలు పెట్టుకుని నిత్యం గొడవపడుతున్నారట. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు తెలియడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారట. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్ధిపేట జిల్లాకు చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి ఈ ఫామ్‌హౌస్‌లో పనికి చేరారు. ఎల్లయ్య భార్యకు అప్పటికే ఫాంహౌస్‌లో విధులు నిర్వర్తిస్తున్న అంజనేయులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం తన భార్యకు ఆంజనేయులు మాయమాటలు చెప్పి లేపుకెళ్లాడని ఎల్లయ్య ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. ఎల్లయ్య తన భార్య కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో కూడా వెతికాడు. చివరికి పోలీసులను ఆశ్రయించగా, నీ భార్య వస్తుందిలే పో అంటూ పంపించివేశారు. 
 
అయితే, తనకు న్యాయం చేయాలంటూ ఓ వీడియో రూపొందించిన ఎల్లయ్య సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో, పోలీసులు తనను ఇంటికి వచ్చి మరీ కొట్టారంటూ ఎల్లయ్య ఆరోపిస్తున్నాడు. దీనిపై పోలీసులు భిన్నవాదన వినిపిస్తున్నారు. ఎల్లయ్య వేధింపులు భరించలేక అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని గజ్వేల్ సీఐ అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తొడగొట్టి చెబుతున్నా... 2024లో ఎంపీ సీట్లన్నీ మావే : విజయసాయిరెడ్డి