Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు - తెలంగాణాలో ఎన్.ఐ.ఏ సోదాలు...

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (10:45 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) సోదాలకు దిగింది. నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో ఉప్పల్ చిలుకానగర్‌లోని హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంటిలో ఎన్ఐఏ అధికారులు సోదాలకు నిర్వహించారు.

గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు చేస్తున్నారు. అలాగే, పర్వతపురంలోని చైతన్య మహిలా సంఘం నేత దేవేంద్ర, అంబేద్కర్ పూల్ యువజన సంఘం అధ్యక్షుడు కిరణ్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేశారు. 
 
నర్సింగ్ విద్యార్థిని రాధ రెండళ్ళ క్రితం ఏపీలోని విశాఖలో తప్పిపోయింది. దీంతో ఆమె తల్లి విశాఖపట్టణం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని, బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్పించుకున్నారని బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ కేసు రిజిస్టర్‌ చేసింది. దీంతో శిల్ప, దేవేంద్రతోపాటు కిరణ్‌ ఇండ్లలో ఎన్‌ఐఏ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments