గోదావరి మధ్యలో ప్రధాని ఫోటోనా? చాలా బాగోదా... బాగుంటుందా?

కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:50 IST)
కడప ఉక్కు ప్రాజెక్టు కోసం పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ స్పందించారు. "కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు! పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని పార్లమెంట్ సభ్యుడు సిఎం రమేష్ గారు చేస్తున్న దీక్ష ఆరో రోజుకి చేరుకుంది. అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడం ఆంధ్రుల పట్ల బీజేపీ నేతల వైఖరిని మరోసారి బయటపెడుతుంది.
 
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చెయ్యకుండా హామీల అమలు కోసం ఢిల్లీ లో యాత్రలు చేస్తే బాగుంటుంది'' అని ట్వీట్ చేశారు. 
 
ఐతే పనిలో పనిగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు చేసిన ట్వీట్ ను ఆయన ఉటంకించారు. అందులో ఏమున్నదంటే... " పోలవరం పనులు జరిగే చోట ప్రధాని ఫోటో పెట్టాలి: వీర్రాజు.సోము, గోదావరి మధ్యలో అయితే బాగుంటుందేమో, ఫొటోకు దండ వేసి దండం పెట్టుకోవచ్చు!'' అని. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments