Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్కును అడ్డుకుంది టీడీపీనే.. ఇపుడు తుక్కు దీక్ష : పవన్ విసుర్లు

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకుంది అధికార తెలుగుదేశం పార్టీయేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పైగా, ఇపుడు ఉక్కు దీక్ష పేరుతో తుక్కు దీక్షను చేపట్టారంటూ సెటైర్లు వేశారు. విజయవా

Advertiesment
ఉక్కును అడ్డుకుంది టీడీపీనే.. ఇపుడు తుక్కు దీక్ష : పవన్ విసుర్లు
, సోమవారం, 25 జూన్ 2018 (10:05 IST)
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకుంది అధికార తెలుగుదేశం పార్టీయేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పైగా, ఇపుడు ఉక్కు దీక్ష పేరుతో తుక్కు దీక్షను చేపట్టారంటూ సెటైర్లు వేశారు. విజయవాడలో ఆదివారం ఆయనతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయాంశాలపై వారిద్దరి మధ్యా చర్చసాగింది.
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఈ నెల 29న కడప ఉక్కు కర్మాగారం కోసం చేపట్టే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలసి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాయన్నారు. వామపక్షాలదీ, తమదీ ఒకే ఆలోచనలు, ఒకే భావజాలమని, మూడు నెలల్లో వామపక్షాలు, జనసేన కలసి ఉమ్మడి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. 
 
ఇకపోతే, విభజన హామీ మేరకు కడప జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వమే అడ్డుపడిందని, ఇప్పుడు ఆ పార్టీయే గోల చేస్తోదని దీక్షలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రంలో క్లీన్‌ గవర్నెన్స్‌ వస్తుందనీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతును ఇచ్చానని పవన్‌ చెప్పారు. అది జరగకపోవడం వల్లే దూరమయ్యానన్నారు. ఇదే విధానం కొనసాగితే.. నిరుద్యోగం పెరిగి, యువతలో అశాంతి నెలకొంటుందని పవన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిడ్డలతో కలిసి రైలులో నుంచి దూకిన మహిళ... చిన్నగాయం కూడా...