Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి పుడుతుందనుకుంటే.. అబ్బాయి పుట్టాడు.. అంతే చంపేసింది..?

ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (09:36 IST)
ఆడ శిశువుల భ్రూణ హత్యల గురించి వినేవుంటాం. అయితే ఇక్కడ పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై కుమారుడు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి నిజాలేంటో నిగ్గు తేల్చారు.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి తనకు కుమార్తె పుడుతుందని ఆమె అనుకుంది. కానీ కుమారుడే పుట్టడంతో నిరాశ చెందింది. బాలుడికి ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అని పేరు పెట్టిన దేవిక, ఆమె భర్త, బిడ్డను పది నెలల పాటు పెంచారు.
 
ఇంతలో తన కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాగిలాల సాయంతో దేవిక ఇంటి వద్ద డ్రమ్ములోనే పిల్లాడి మృతదేహాన్ని కనుగొన్నారు. చివరకు కన్నబిడ్డను తల్లే చంపేసిందని విచారణలో వెల్లడి అయ్యింది. దీంతో దేవికను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments