Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వై నాట్ 175' : వైకాపాను తొక్కిపట్టి నారతీశాం.. బాలకృష్ణ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు తేరుకోలేని షాక్ తగిలింది. ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టం కట్టారు. మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. శుక్రవారమే రెండు స్థానాల్లో విజయం ఖరారు కాగా, శనివారం పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. చివరి ఓటు లెక్కింపు వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపు తుది ఫలితంలో వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ ఫలితాల వెల్లడి తర్వాత వైకాపా, టీడీపీ మధ్యల యుద్ధం మొదలైంది. ఈ ఫలితాలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని వైకాపా పెద్దలు చెబుతుంటే.. రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఫైనల్ ఫలితాల్లోనూ ఇది రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు జోస్యం చెబుతున్నారు. 
 
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఫలితాలపై స్పందించారు. గతంలో 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తామని జగన్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ వై నాట్ 175 అని ఇపుడు జగన్ చెబుతుంటే వినాలని ఉందన్నారు. ఎమ్మెల్యీ ఎన్నికల్లో వైకాపాను తొక్కిపట్టి నార తీశారని ఆయన తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. పులివెందుల కోటకు బీటలు వారుతున్నాయన్నారు. త్వరలోనే ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా చేరుతాయని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments