Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు...

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (10:23 IST)
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పాఠశాలలు తెరవొద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్పష్టం చేసింది. ఈ మేరకు తన పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బలవంతపు చదువులతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది. అందువల్ల ఏప్రిల్ ఒకటో తేదీ వరకు స్కూల్స్ తెరవొద్దని తెలిపింది. పైగా, తాము జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌ను ఖచ్చితంగా పాటించాలని విధిగా సూచించింది. దీన్ని ఉల్లంఘించే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 
 
కొత్త విద్యా సంవత్సరం 202-24లో ముందుగానే తరగతులు ప్రారంభిస్తున్నారంటూ దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీనిపై సీబీఎస్ఈ స్పందించింది. ఏప్రిల్ ఒకటో తేదీ కంటే ముందుగా తరగతులు ప్రారంభిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అకడమిక్ క్యాలెండర్‌ను ఫాలో అవ్వాలని సూచించింది. ముందుగా స్కూల్స్ ప్రారంభించడం వల్ల విద్యార్థులపై అవసరనంగా అదనపు ఒత్తిడి పడుతుందని సీబీఎస్ఈ తెలిపింది. 
 
అకడమిక్స్‌తో పాటు ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్‌లు విద్యార్థులకు చాలా ముఖ్యమని తెలిపింది. అందువల్ల నిర్ణీత సమయం కంటే ముందుగా స్కూల్స్ ప్రారంభిస్తే ఇతర లైఫ్ స్కిల్స్ నేర్చుకునే అవకాశాలు లేకుండా పోతాయని వెల్లడించింది. ప్రస్తుతం సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments