Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ స్కూల్స్‌లో స్టూడెంట్ అభ్యాసన ప్రక్రియను మెరుగ్గా చేస్తున్న లీడ్

Teacher
, శుక్రవారం, 3 మార్చి 2023 (18:13 IST)
ఆంధ్రప్రదేశ్ లోని లీడ్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో, కోవిడ్ సంబంధిత సవాళ్లు ఉన్నా సరే, దాదాపు 20% మేర స్టూడెంట్ అభ్యాసన ఫలితాలను మెరుగు చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని 240కి పైగా స్కూళ్లలో లీడ్ ఇంటెగ్రేటెడ్ స్కూల్ సిస్టం ఇప్పటికే అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో 90,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి 2500+ మందికి పైగా టీచర్లు ఇప్పటికే లీడ్ ద్వారా శిక్షణ పొంది సర్టిఫై అయ్యారు. 
 
ద్వితీయ శ్రేణి పట్టణాలలోని స్కూల్స్‌లో మార్పులు సాధించడం ద్వారా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ, ఈ పట్టణాలకు మరియు ఇండియాలోని మెట్రోలు పెద్ద నగరాలకు మధ్య ఉన్న విద్యా అంతరాన్ని లీడ్ తగ్గిస్తోంది. లీడ్ యొక్క ఇంటెగ్రేటెడ్ సిస్టం దేశవ్యాప్తంగా 400+ పట్టణాలు/నగరాలలో 3000+ పైగా స్కూల్స్లలో అందుబాటులో ఉంది. దీని ద్వారా 12 లక్షల మంది స్టూడెంట్స్‌కి  చేరువ అయ్యింది. అలాగే 25000+ టీచర్లకు సాధికారకతను అందించింది. LEAD స్కూల్ స్టూడెంట్స్ కమ్యూనికేషన్, కొలాబరేషన్ మరియు క్రిటికల్ థింకింగ్ వంటి భవిష్యత్తు స్కిల్స్‌ను నిర్మించుకొని విజయం సాధించేందుకు తగిన విశ్వాసాన్ని పొందగలుగుతారు.
 
సుమీత్ మెహతా, కో-ఫౌండర్ మరియు సిఈఓ, LEAD  మాట్లాడుతూ "ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు.  అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా మా లీడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం ద్వారా స్కూల్స్ లకు సాధికారిక అందించడం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము ఈ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన భాగం. రాబోయే ఐదు సంవత్సరాలలో 60 వేల స్కూల్స్ లలో రెండున్నర కోట్ల మంది స్టూడెంట్స్ ని చేరుకునే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవడంపై మేము దృష్టి సారించాము" అని అన్నారు.
 
కుమారి షింపి, ప్రిన్సిపల్, భారతీయ విద్యా భవన్, విశాఖపట్నం లీడ్ గురించి మాట్లాడుతూ, "భారతీయ విద్యా భవన్ వైజాగ్‌లో 1994లో ఏర్పాటు కాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని అగ్రగ్రామి స్కూళ్ళులో ఒకటిగా నిలిచింది. మేము ఆధునిక పాఠ్యప్రణాళిక, సృజనాత్మకత-సాంకేతికలను సమ్మిళితం చేయడం ద్వారా మా స్టూడెంట్స్ ను భవిష్యత్తుకు సిద్ధం చేసేలా విశ్వాసం పెంపొందించేలా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం కోసం అన్వేషించాము.  అందుకు LEAD సరిగ్గా సరిపోయింది" అని అన్నారు.
 
“అభ్యసన లక్ష్యాలు, వనరులు తగిన స్థాయిలో అందించినప్పుడు స్టూడెంట్ అభ్యసన ఫలితాలు ఆటోమేటిక్ గా  అభివృద్ధి చెందుతాయి.  LEAD వారు అందించే టీచర్ ట్రైనింగ్ మోడ్యూల్స్ , లెసన్ ప్లాన్స్ మరియు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ తరహా మార్పును మేము చూడగలిగాము. మా పిల్లలు  ఇప్పుడు కాన్సెప్ట్ లను, సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అలాగే వారి విద్యా ప్రదర్శన  మెరుగైంది.  LEAD యొక్క కోడింగ్ అండ్ కంప్యూటేషనల్  స్కిల్స్ ప్రోగ్రాంలో భాగంగా యాప్స్, వెబ్‌సైట్స్ వంటి  వివిధ ఆసక్తికరమైన ప్రాజెక్టులపై మా విద్యార్థులు కృషి చేశారు" అని అన్నారు. ఒక స్కూల్‌ను స్మార్ట్ స్కూల్‌గా మార్చుతూ సమగ్ర స్థాయిలో తీర్చిదిద్దడంలో LEADను ఎంతగానో సిఫారసు చేస్తాము" అని ఆమె జోడించారు.
 
స్కూల్ నిర్వాహకులకు నిర్వహణ నైపుణ్యాలను సమర్ధతను LEAD అందిస్తోంది. టీచర్ స్కిల్స్, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. అలాగే పార్టనర్ స్కూల్స్ లోని పేరెంట్స్‌తో మెరుగ్గా సంప్రదింపులు చేయడంలో సహకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని Affordable Private Schools ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో సహాయపడుతోంది. విద్యార్థులకు ఉత్తమ  పాఠ్యప్రణాళిక పొందే ఎంపిక ఉండడం, ఉత్తమ టీచింగ్ టాలెంట్ను పొందగలగడం, ఇంగ్లీషులో విద్యార్థి  అభ్యసనాన్ని పెంపొందించడం, అలాగే సంపూర్ణమైన స్కూల్ ఎడ్యుకేషన్ కోసం సరైన టెక్నాలజీని పొందగలగడం ఉంటాయి.  అడ్మిషన్లు పెంచుకోగలగడం, పేరెంట్స్ కి  చక్కని ఎంపిక కావడం వంటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ లోని  LEAD Powered Schools పొందగలుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కులాంతర ప్రేమ వివాహం.. మేడ్చల్‌లో యువకుడి దారుణ హత్య