Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లెడ్జ్‌టు ప్రొపెల్‌ కార్యక్రమంతో కెరీర్‌ వృద్ధి అవకాశాలు: ఐడియాస్‌2ఐటీతో చేతులు కలిపిన ఐడియాఆర్‌ఎక్స్‌

Gayatri
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (23:34 IST)
హై ఎండ్‌ ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ఐడియాస్‌2ఐటీ మరియు హెల్త్‌టెక్‌ స్టార్టప్‌ ఐడియాఆర్‌ఎక్స్‌లు నేడు అధికారికంగా ప్లెడ్జ్‌2ప్రొపెల్‌ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించాయి. ఆర్ధిక మందగమనం, లేఆఫ్స్‌తో సతమతమవుతున్న టెక్‌ ప్రొఫెషనల్స్‌కు సహాయపడటమే లక్ష్యంగా ప్రారంభించిన కెరీర్‌ వృద్ధి కార్యక్రమమిది. ఈ వినూత్న కార్యక్రమం, ఈ టెక్‌ నిపుణులకు అవసరమైన మద్దతు అందించడంతో పాటుగా రీ-గ్రూప్‌ అవకాశాలు అందించడం, అప్‌స్కిల్లింగ్‌తో  నూతన అవకాశాలను అందించడం, వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూనే వ్యాపారవేత్తలుగా మారే అవకాశాలను అందించడం చేయనుంది.

 
ఈ అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమంలో భాగంగా తాజా సాంకేతికతలు, టూల్స్‌ అయిన ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌, డాటా ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డెవ్‌ఆప్స్‌, రొబొటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ తదితర అంశాలలో మెంటార్‌షిప్‌ అందిస్తారు. ఉద్యోగాల కోసం వెదకడంలో ప్లెడ్జ్‌2ప్రొపెల్‌ సహాయపడుతుంది కానీ జాబ్‌ గ్యారెంటీ మాత్రం ఇవ్వదు. ఈ భాగస్వామ్యంతో తాము ఎంతోమంది టెక్‌ నిపుణుల జీవితాలకు స్ఫూర్తినందించడంతో పాటుగా తగిన సాధికారితనూ అందించనున్నామి  ఐడియాస్‌2ఐటీ  సీఈఓ గాయత్రి అన్నారు

 
ఐడియా ఆర్‌ఎక్స్‌ ఫౌండర్‌, సీఈఓ శరవణన్‌ వివేకానందన్‌ మాట్లాడుతూ ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఎంతోమంది ప్రొఫెషనల్స్‌  మానసికంగా కృంగిపోతున్నారు. ఆర్థిక సవాళ్లనూ ఎదుర్కొంటున్నారు. దీనిని అధిగమించడంలో సహాయపడేందుకు తాము మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్‌తో పాటుగా  ఫైనాన్షియల్‌ కౌన్సిలింగ్‌ సైతం అందిస్తున్నామన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్‌స్ట్రక్షన్ కెమికల్ మార్కెట్‌ విస్తరణ దిశగా నిప్పాన్ పెయింట్స్...