Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ టెల్ టెలికాం సేవలు మరింత ప్రియం..

Advertiesment
airtel
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:25 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికా సంస్థల్లో ఒకటైన ఎయిర్‌‍టెల్ సేవలు మరింత ప్రియంకానున్నాయి. ఈ యేడాదిలో ఈ టారిఫ్ చార్జీలను స్వల్పంగా పెంచనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ సీఈవో సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలాధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 
 
వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందని తెలిపారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమున్న మిట్టర్.. భారత్ డిజిటల్ - ఆర్థికవృద్ధి కల సాకారమైనట్టు వివరించారు. భారతీ ఎయిర్‌టెల్ మిట్టల్ గత నెలలో కనీస రీఛార్జ్‌ ధరను 57 శాతం పెంచగా త్వరలోనే టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతుంది. 
 
కాగా, ఎయిర్‌టెల్ 5జీ యూజర్లు 10 మిలియన్ల దాటినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 24 చివరి నాటికి 5జీ సేవలు దేశంలోని ప్రతి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చేరువయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపారు.. ఎయిర్‌టెల్ దేశంలోనే 5జీ సేవలను 2022 అక్టోబరు ఒకటో తేదీన ప్రారంభించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనకాపల్లిలో 1500 కిలోల బరువున్న అరుదైన ఔషధ చేపలు