Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణాల చెల్లింపులపై మారటోరియం.. సుప్రీం కోర్టులో పిటిషన్‌

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (22:50 IST)
కరోనా నేపథ్యంలో రుణాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ చేసిన ప్రకటనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై స్పష్టత కోరుతూ సుప్రీం ధర్మాసనం కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. తమ అభిప్రాయం తెలపాలని కేంద్రం, ఆర్‌బీఐకి సూచించింది.

ఈ ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ది సంస్థ (క్రిడాయ్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

క్రిడాయ్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే ఆర్‌బీఐ ప్రకటన బ్యాంకులన్నింటికీ వర్తించేదిలా ఉండగా.. కొన్ని బ్యాంకులు ఈ ప్రయోజనాలను స్థిరాస్తి రంగానికి అందించడం లేదని తెలిపారు.

కేంద్రం తరఫున దీనికి సమాధానమిచ్చిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనిపై సంబంధిత విభాగాల నుంచి వివరాలు సేకరిస్తామని సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి చేసిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments