Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022లో ప్రపంచ స్విమ్మింగ్‌ పోటీలు

Advertiesment
2022లో ప్రపంచ స్విమ్మింగ్‌ పోటీలు
, సోమవారం, 4 మే 2020 (22:01 IST)
ప్రపంచ స్విమ్మింగ్‌ పోటీలు 2022లో జరగనున్నాయి. జపాన్‌లోని ఫుకుయోకా వేదికగా 2021లో జరగాల్సిన ఈ పోటీలు ఒలింపిక్స్‌ కారణంగా ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌(ఫినా) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

షెడ్యూల్‌ ప్రకారం వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ స్విమ్మింగ్‌ పోటీలు 2021 జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు జరగాల్సి ఉంది. రీ షెడ్యూల్‌ ప్రకారం ఈ పోటీలు 2022 మే 13 నుండి 29 వరకు జరగనున్నాయి.

అన్ని స్విమ్మింగ్‌ సమాఖ్యల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఫినా అధ్యక్షులు జులియో మాగ్లియోన్‌ సోమవారం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఇంటికి మూడు మాస్క్‌లు ఏవీ?: చంద్రబాబు