Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నా.. కొ...ని ఎన్‌కౌంటర్ చేయండి.. ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకూ రావొద్దు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:21 IST)
ప్రేమ పేరుతో తన కుమార్తెపై కత్తితో దాడి చేసిన భరత్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని, ఈ దుస్థితి ఏ ఆడపిల్లకూ రాకూడదని 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలుపుకున్న మధులిక తండ్రి రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 
ఈనెల 6వ తేదీన ప్రేమోన్మాది భరత్‌ బాలికను వేధించడమేకాకుండా తన ప్రేమను నిరాకరించినందుకు కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన మధులిక మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 15 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఏడు శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ల బృందం ఆమె ప్రాణాలను కాపాడారు. ఆరోగ్యం కుదుటపడడంతో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 
 
దీనిపై మధులిక తండ్రి మీడియాతో మాట్లాడుతూ, 15 రోజులపాటు నా బిడ్డ ప్రాణాలతో పోరాడింది. వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. ఆమె జీవితంతో ఆడుకొని మాకు ఈ దుస్థితి కల్పించిన భరత్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలి. లేదంటే ఉరి తీయాలి. అతడికి సహకరించిన కుటుంబ సభ్యులనూ కఠినంగా శిక్షించాలి. మధులికపై జరిగిన దాడిలాంటి ఘటనలు ఏ ఆడపిల్లపై జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఆమె తండ్రి రాములు. ఈనెల 6వ తేదీన ప్రేమోన్మాది భరత్‌ బాలికను వేధించడమే కాకుండా తన ప్రేమను నిరాకరించినందుకు కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments