బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ఠాగూర్
సోమవారం, 17 నవంబరు 2025 (14:12 IST)
వైకాపా నేతలకు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ అభిమాన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామంటూ హెచ్చరించారు. తాను ఒక బాలయ్య అభిమానిగా ఈ హెచ్చరిక చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు.
 
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెస్ రాజు... హిందూపురంలో బాలకృష్ణపై కొందరు వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 
 
హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడారు. దీంతో ఆవేశానికి లోనైన మా కార్యకర్తలు వైకాపా కార్యాలయంపై దాడి చేశారు. ఇది మీకు, మీ అధినేతకు కూడా మా హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
కాగా, హిందూపురంలోని వైకాపా కార్యాలయంతో పాటు పార్టీ ఇన్‌చార్జి దీపిక రెడ్డి భర్త కార్యాలయంపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments