Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ళ రాకపోకలు... 'జర్నీ'కి ఆంక్షలు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (12:53 IST)
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. కానీ, ఈ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ లాక్‌డౌన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తుండగా, ఈ నెల 15 నుంచి రైళ్లను నడిపించేందుకు పక్కా నిబంధనలతో కూడిన ప్రణాళికపై రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కొనసాగినా, పలు నిబంధనలు అమలు చేస్తూ, పరిమిత సంఖ్యలో రైళ్లను నడిపించాలని ఇండియన్ రైల్వేస్ యోచిస్తున్నట్టు సమాచారం.
 
ఇదే అంశంపై గురువారం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన రైల్వే బోర్డు ఛైర్మన్, రైళ్లను తిప్పడంపైనే ప్రధానంగా చర్చించారు. అన్ని రైళ్లనూకాకుండా, ఎంపిక చేసిన మార్గాల్లో, రైళ్లను తిప్పాలని, తద్వారా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గమ్యాలకు చేర్చాలని భావిస్తోంది. 
 
ఆయా రాష్ట్రాలు దాటకుండా రైళ్లను నడిపించేందుకు విధి విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఇంకా ఓ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, కొన్ని రైళ్లను, కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తూ, నడిపించవచ్చని తెలుస్తోంది. 
 
అన్ని రైళ్లలో నాన్ ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైళ్లన్నీ గమ్యస్థానం చేరేలోగా, ఒకటి లేదా రెండు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. కొన్ని రైళ్లు నాన్‌‌స్టాప్‌ పద్ధతిలో నడుస్తాయి. ప్రయాణికులు కనీసం 12 గంటల ముందు తన ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ప్రయాణ సమయంలో కరోనా లక్షణాలు బయటపడితే, అతన్ని మధ్యలోనే దింపేస్తారు. 
 
ఇక బెర్త్ ఖరారైన వారికి మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వయో వృద్ధులను రైలు ఎక్కనివ్వరు. ప్రయాణ సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రయాణికులంతా విధిగా సామాజిక దూరం పాటిస్తూ, థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షల అనంతరమే రైళ్లు ఎక్కాలి. ప్లాట్‌ ఫామ్ టికెట్ల విక్రయాలను అనుమతించరు.
 
థర్మల్ స్క్రీనింగ్ తర్వాత, నామమాత్రపు రుసుం చెల్లించి, గ్లౌజులు, మాస్కులను కొనుగోలు చేసి, రైళ్లలోకి వెళ్లాలి. ఇక రైలు బోగీలో క్యాబిన్‌లో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. సైడ్‌ బెర్తులు ఖాళీగానే ఉంటాయి. రైళ్లలో ఏ విధమైన తినుబండారాల విక్రయాలనూ అనుమతించరు. 
 
ఈ నిబంధనల మధ్య రైళ్లను నడిపించే విషయమై ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడవచ్చని, ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటికే తాము ప్రతిపాదనలు పంపామని, అనుమతుల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments