సల్మాన్ పెద్ద మనసు : 25 వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ

గురువారం, 9 ఏప్రియల్ 2020 (15:03 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోవడంతో అనేక సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అలాంటివారిలో సల్మాన్ కాన్ ఒకరు. 
 
లాక్‌డౌన్ పరిస్థితుల దృష్ట్యా సినీ కార్మికుల ప‌డుతున్న ఇబ్బందుల‌ని గ్ర‌హించిన స‌ల్మాన్... దాదాపు 25 వేల మంది సినీ కార్మికులకు రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం చేస్తాన‌ని ప్రకటించారు. ఆ మాటను ఆయన ఇపుడు నిలబెట్టుకున్నారు. అన్న‌ట్టుగానే తొలి విడత‌గా.. 25 వేల కార్మికుల ఖాతాల్లో రూ.3 వేలు జమ చేసారు. ఈ విషయాన్ని 'ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ యూనియన్' తెలిపింది.
 
చెప్పిన మొత్తాన్ని ఒకేసారి జ‌మ‌చేస్తే వృధాగా పోతుంద‌ని, అందుకే ప‌లు విడ‌త‌ల‌లో అందిస్తాన‌ని స‌ల్మాన్ అన్నార‌ట‌. రానున్న రోజుల‌లో రెండు, మూడు విడ‌త‌ల‌లో మిగ‌తా డ‌బ్బుల‌ని జ‌మ చేస్తారట‌. అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ 3000 మంది సినీ కార్మికులకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేసింది.
 
వీళ్లతో పాటు రోహిత్ శెట్టి, బోనీ కపూర్,అర్జున్ కపూర్ ఫిల్మ్ ఫెడరేషన్‌కు విరాళాలు అందజేసారు. ఇక ప్రొడ్యూసర్ గిల్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు సాయం చేసింది. మొత్తంగా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన డబ్బులతో సినీ కార్మికులను ఆదుకుంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు తివారీ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హనుమంతునిపై భక్తికి మా అన్నయ్యే కారణం : పవన్ కళ్యాణ్