Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్, అమెరికాలో శవాల గుట్టలు, పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 2000 మంది

కరోనా వైరస్, అమెరికాలో శవాల గుట్టలు, పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 2000 మంది
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:03 IST)
కరోనా వైరస్ అమెరికాలో కరాళ నృత్యం చేస్తోంది. వేలల్లో ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. నిన్న ఒక్కరోజే సుమారు 2 వేల మంది దాకా ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. బుధవారం రాత్రి 8:30 గంటల వరకు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ వరుసగా రెండవ రోజు దాదాపు 2 వేల కరోనా వైరస్ మరణాలను నమోదు చేసింది.
 
నిన్న ఒక్కరోజే 1,973 మంది మరణించారు. ఇది అంతకుముందు రోజు 1,939 మంది కంటే కొంచెం ఎక్కువ. దీనితో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 14,695కు చేరుకుంది. ఫలితంగా స్పెయిన్ 14,555 మంది మరణాల సంఖ్యను దాటేసింది. కానీ ఇటలీలో కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 17,669‌గా ఉంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ, మిమ్మల్ని మరువలేం
భారత ప్రదాని మోడీకీ.. భారత ప్రజలకు, కృతజ్ఞతలు తెలియజేసారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కష్టకాలంలో తమకు “హైడ్రాక్సీ క్లోరోక్విన్” అందిచే నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని “అమెరికా ఈ సహాయాన్ని ఎన్నటికీ మరచిపోదు”, అంటూ ట్వీట్ చేశారు ట్రంప్.
 
కష్టకాలంలోనే నిజమైన స్నేహితులు మరింత సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందంటూ పిలుపునిచ్చారు ట్రంప్. మోడీ బలమైన నాయకత్వం భారత్‌కు మాత్రమేకాదు, మానవాళి మొత్తానికి ఉపయోగపడుతుందంటూ  ట్రంప్ కొనియాడారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ModiLeadingTheWorld ట్విట్టర్లో టాప్ ట్రెండ్, ఎందుకని?