గుంటూరులో ఆంక్షలు కఠినం : మాస్కులేకుండా బయటకొస్తే జేబుఖాళీ

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (12:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా అత్యధిక ప్రభావిత జిల్లాలో గుంటూరు ఒకటి. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాలను ప్రభుత్వం రెడ్‌జోన్లుగా ప్రకటించారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లోభాగంగా, తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.వెయ్యి అపరాధం విధించాలని నిర్ణయించారు. 
 
అలాగే, లాక్‌డౌన్‌లో ప్రజలు బయటికి రాకుండా, అత్యవసర పని మీద వచ్చినా కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. 
 
అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకే బయటకు రావాలని సూచించారు. అప్పుడు కూడా మాస్కులు ధరించి, సామాజికదూరం పాటించాలని స్పష్టంచేశారు. 
 
అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపు ఆఫీసులకు వెళ్లి.. సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments