Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధిస్తోందనీ అత్తను కడతేర్చిన కోడలు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:20 IST)
తనను నిత్యం వేధిస్తూ వచ్చిన అత్తను ఆ ఇంటి కోడలు కడతేర్చింది. ఈ దారుణం కడప జిల్లా రాజంపేట పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, రాజంపేట పట్టణం ఎర్రబెల్లికి చెందిన సుమిత్రమ్మ (55) అనే మహిళకు కుమారుడు మహీదర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి వివాహమైంది. కోడలు పేరు శ్వేత. అయితే, గత యేడాది మే 3న సుమిత్రమ్మ దారుణ హత్యకు గురైంది. 
 
శ్వేతను సుమిత్రమ్మ నిత్యం వేధిస్తుండడంతో ఆమె రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ సందర్భంలో అత్త పెడుతున్న అగచాట్లు తల్లికి చెప్పి శ్వేత బోరుమనేది. దీంతో సుమిత్రమ్మను చంపేస్తే పీడ విరగడవుతుందని తల్లీ కూతుర్లు భావించారు.
 
అనంతపురం జిల్లా పశ్చిమ నడిమిపల్లిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన కిరాయి హంతకులు ఓర్సు నాగరాజు, కొండ్ల వాల్లపల్లికి చెందిన మల్లెల రమేష్, మల్లికార్జునలను సంప్రదించి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారు మే మూడవ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమిత్రమ్మను దారుణంగా చంపేశారు.
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం కాగా శ్వేత, ఆమె తల్లి కూడా అందరిలాగే తమకే సంబంధం లేదన్నట్టు నటించేశారు. పాతకక్షల నేపధ్యంలో ఎవరో తన తల్లిని చంపేసి ఉంటారని భావించిన మహీధర్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టమైంది.
 
అయినా ఈ కేసును సవాల్‌గా స్వీకరించి వేర్వేరు కోణాల్లో విచారించడంతో కోడలు, వియ్యపురాలే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. దీంతో శ్వేత, ఆమె తల్లితోపాటు కిరాయి హంతకులు నాగరాజు, మల్లికార్జున, రమేష్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 62 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments