Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడాలి నాని మనిషి కాదు...గజ్జికుక్క: పిల్లి మాణిక్యాలరావు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:22 IST)
మంత్రి కొడాలి నాని మనిషి కాదని, ఆయన గజ్జి కుక్క అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై నాని చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. ఆయన ఓంకా ఏమన్నారంటే...
 
జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారీ పనికిమాలిన మంత్రి కొడాలి నాని తెరపైకి వచ్చి ప్రజలను అసలు విషయం నుంచి పక్కదారి పట్టించేందుకు బూతులు అందుకుంటాడు. ఇలా మాట్లాడించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

అప్పులు తెచ్చుకుని ఆ అప్పులను మింగడానికి పాలకులు కుట్ర చేస్తున్నారు. మంత్రి అనే వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. శవాలను కాల్చుకు తినే వాడిలా ఉండే కొడాలి నానికి ఏ అర్హతలు ఉండవు. అసలు ఈ ప్రెస్ మీట్ కొడాలి నాని పెట్టాడా లేక ముఖ్యమంత్రే పెట్టించాడా ?

జగన్మోహన్ రెడ్డికి ధైర్యముంటే కొడాలి నాని పెట్టిన ప్రెస్ మీట్ సొంతగా పెట్టాడా లేక ప్రభుత్వం తరపున పెట్టాడో వివరణ ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ఒక విలువ ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి. ముఖ్యమంత్రి తాను చేసే ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పనులను వెనకేసుకురావడానికి ఒక దౌర్భాగ్యుడు కావాలని నానికి మంత్రి పదవి ఇచ్చాడు.

రాష్ట్ర ప్రజలతో , రాజ్యాంగ విలువలతో నానికి సంబంధం లేదా? అసలు కొడాలి నాని మనిషేనా? చంద్రబాబుని వాడూ వీడు అని మాట్లాడతావా? చంద్రబాబును చూడగానే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ లేచి నిలబడేవాడు. నువ్వు పిచ్చికుక్కలా మాట్లాడినా ఎవరూ పట్టించుకోరు. ఎన్నిసార్లు ఛీ కొట్టినా నీకు సిగ్గులేదు. గజ్జికుక్క కంటే హీనమైన బతుకు నీది.

మాజీ మంత్రి ఉమా గురించి ఏం మాట్లాడుతున్నావ్? ఉమక్క అని మాట్లాడమేంటి?  ఉమా గారు ఆడా-మగా అని చెక్ చేసుకోవడానికా నీకు మంత్రి పదవి ఇచ్చింది? ఉమా గారి భార్యను అడుగు ఆయన ఎంతటి మగాడో తెలుస్తుంది. ఏ విషయంపైనేనా దేవినేని ఉమాతో చర్చకు కొడాలి నాని రావాలి. పోలవరం నుంచి సన్నబియ్యం వరకు చర్చిద్దాం

రా...రైతు సమస్యలపై రాష్ట్రమంతా చర్చ నడుస్తుంటే దానిపై మాట్లాడకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్. 
వైఎస్ తెచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని అంతకంటే మిన్నగా చంద్రబాబు అమలు చేశారు. వైఎస్ తెచ్చిన పథకాలను జగన్ నామరూపాలు లేకుండా చేస్తున్నాడు. నాకు ఇలాంటి దరిద్రుడు, వెధవ పుట్టాడేంటని వైఎస్ ఆత్మ క్షోభిస్తోంది.

రైతు భరోసా కింద రూ. 13 వేలు ఇస్తున్నట్టు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులను నొక్కేస్తున్నారు. కొడాలి నాని కి సిగ్గుందా ? నానికి బూతుల మీద ఉన్నంత పట్టు శాఖపై లేదు.  రైతు భరోసా కింద ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తోందో తేలుద్దాం రండి. మంత్రి అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలికానీ ఇతరులపై అసహ్యంగా మాట్లాడ్డమేంటి?

జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ చెబితే నాకు సీటొచ్చిందని చెబుతున్నావ్..వీళ్లంతా చెప్పింది చంద్రబాబుకే. నందమూరి, నారా కుటుంబం కలిసిమెలిసి ఉంటోంది. తెలుగుదేశం నుంచి బయటకు రమ్మని జూనియర్ ఎన్టీఆర్ తో ఓసారి చెప్పి చూడు...నీకు తగిన బుద్ధి చెప్తాడు. నీలాంటి వెధవలకు సీటు ఇప్పించి తల దించుకుంటున్నాను అని జూనియర్ ఎన్టీఆర్ పౌరుషంగా సమాధానం చెప్తాడు.

జూనియర్ ఎన్టీఆర్ లో నరనరాన తెలుగుదేశం పార్టీ రక్తం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ రక్తం ఆయనలో ఉంది. నీలాగా పార్టీలు మారే వ్యక్తి కాదు ఆయన. స్వర్గీయ హరికృష్ణ నిజమైన తెలుగుదేశం నేత. ఒక శిఖండి నుంచి టీడీపీని కాపాడుకునేందుకు ఆయన చంద్రబాబుకు అండగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఆయన అభిమానం దెబ్బతింటుంది. వారి పేర్లు ఎత్తే అర్హత కొడాలి నానికి లేదు.

ఎన్టీఆర్ నాయకత్వంలో కొందరు శిఖండులు పార్టీని తప్పుదారి పట్టించాలని చూస్తే చంద్రబాబు కాపాడారు. వైఎస్ చనిపోతే శవం పక్కనే సంతకాలు సేకరించినవాడు జగన్. కొడాలి నాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గేస్తోంది. సంస్కారం లేని వ్యక్తి నాని. అచ్చెన్నాయుడిని గాడిద అంటావా? మరి నీ రూపాన్ని బట్టి నిన్ను గజ్జికుక్క అనాలి. నోరు తెరిస్తే భౌ భౌ అంటావ్ కదా. అందుకే నువ్వు గజ్జికుక్క.

ఎస్సీ, ఎస్టీ లంటే నీకు చులకనా? వైసీపీ పాలనలో ఎస్టీ, ఎస్సీలపై దాడులు జరుగుతుంటే మంత్రిగా నువ్వేం చేస్తున్నావ్? రాష్ట్ర ప్రజలు వివేకవంతులు. ఎన్ని మోసాలు చేసినా ప్రజలు చూస్తూ ఊరుకుంటారనే భ్రమల్లో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు.

చంద్రబాబుకు వయసైపోయిందని దారుణంగా మాట్లాడతావా? మీడియా గురించి మాట్లాడతావా? మనస్సాక్షి లేని మీ విష పుత్రికలా ఏ మీడియా వ్యవహరించడం లేదు. గురువింద నీతులు ఎవరికి చెబుతున్నావ్ నాని. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో M4M హిందీ ట్రైలర్ విడుదల

రామ్ పోతినేని 22వ సినిమాలో నాయికగా భాగ్యశ్రీ బోర్సే ఖరారు

మిస్టర్ ఇడియ‌ట్‌ లో మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌పై లిరికల్ సాంగ్ చిత్రీకరణ

సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments