Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబద్ధాల అంబటి ... ఆపు నీ అసత్యాలు: పిల్లి మాణిక్యరావు

Advertiesment
అబద్ధాల అంబటి ... ఆపు నీ అసత్యాలు: పిల్లి మాణిక్యరావు
, సోమవారం, 31 ఆగస్టు 2020 (18:53 IST)
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అబద్ధాల రాంబాబుగా మారి, తనకున్న పెద్దగొంతుతో అబద్ధాలుచెబుతూ, ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడని, ఆయనమాటలు విని ప్రజలంతా సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్య రావు ఎద్దేవాచేశారు.

సోమవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.  దళితుల్లో పుట్టాలని ఎవరైనాకోరుకుంటారా అని చంద్రబాబు అన్నట్లుగా అభూతకల్పనలతో అసత్యప్రచారం చేస్తున్న అంబటి అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని టీడీపీనేత హితవు పలికారు. అంబటి సహా, ఏ వైసీపీనాయకుడైనా సరే నీతికి పుట్టుంటే, భవిష్యత్ లోమరెప్పుడూ చంద్రబాబు గురించి అటువంటి ప్రచారం చేయరని మాణిక్యరావు తెగేసిచెప్పారు.

ఆనాడు చంద్రబాబు దళితులపరిస్థితి గురించి మాట్లాడుతూ, సామాజికంగానేకాకుండా, ఆర్థికంగాకూడా వారు వెనుకబాటుకు గురవుతున్నారని, చెప్పే క్రమంలో, “దళితులు ఇంకా వెనుకబడే ఉన్నారు... వారికి ఆర్థికాభివృద్ధి లేదు, వారు ఇంకా ఉన్నతస్థానాలకు వెళ్లాలి. అలాంటి జీవితాలు కావాలని ఎవరైనా కోరుకుంటారా” అంటూ వారు అనుభవిస్తున్న వెతలగురించి ఆయన మాట్లాడితే, దాన్నితమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీనేతలు, తమ విషపుత్రికఅయిన సాక్షిని అడ్డుపెట్టుకొని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని పదేపదే  దుర్మార్గపు ప్రచారం చేశారన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై 137 దారుణాలు దళితులపై జరిగాయని, అవిగాక బీసీలు, ఇతర వర్గాలపై జరిగిన దారుణాలను ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని,  అవేవీ  తమ ప్రభుత్వంలో జరగలేదని, అంబటి రాంబాబు చెప్పగలడా అన్నారు.

డాక్టర్  సుధాకర్ ని పిచ్చివాడిని చేసి, పెడరెక్కలు విరిచి రోడ్లపై ఈడ్చుకెళ్ళినఘటన, చిత్తూరులో డాక్టర్  అనితారాణిని వేధించి, ఆమె బట్టలు మార్చుకుంటుంటే ఫొటోలు తీసి, తీవ్రంగా అవమానించిన దారుణం, గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీనేతల దురహంకారంవల్ల ఆత్మకూరులో  బహిష్కరణకు గురైన దళితకుటుంబాల ఆవేదనలు రాంబాబుకు కనిపించలేదా అని మాణిక్యరావు నిలదీశారు. 

పల్నాడులో విక్రమ్ అనే దళితయువకుడిని అత్యంత కిరాతకంగా నరికిచంపడం, చీరాల్లో మాస్క్ లేదని కిరణ్ ను కొట్టిచంపిన ఘటనల వెనుక వైసీపీప్రభుత్వ హస్తముందో లేదో అంబటి చెప్పాలన్నారు.  దళితవర్గానికి చెందిన జడ్జి రామకృష్ణను దారుణంగా హింసించిన మంత్రి పెద్దిరెడ్డిని ఘటన జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి దండించి ఉంటే, నేడు ఓంప్రతాప్ ఆత్మహత్య జరిగేది కాదన్నారు. 

జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిక్కుమాలిన మద్యపాలసీని అడ్డంపెట్టుకొని, పనికిమాలినబ్రాండ్లను అధికధరకు అమ్ముతున్నా రని ఓంప్రతాప్ చెబితే, అతన్ని బెదిరించి, వేధింపులకు గురిచేసింది  వైసీపీ వారుకాదా..  ఈవిషయం అంబటికి తెలియదా అని టీడీపీనేత ప్రశ్నించారు. 

జడ్జి రామకృష్ణను నానా ఛండాలంగా కులంపేరుతో దూషించి,  బెదిరించినప్పుడే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపుచేసి ఉంటే, ఓంప్రతాప్ బతికేవాడు కాడా అని మాణిక్యరావు నిలదీశారు. ఏపత్రికలు, టీవీఛానళ్లు ఫలానా మద్యం బ్రాండ్లు అమ్మవని చెప్పవనే ఇంగితంకూడా లేకుండా అంబటి మాట్లాతున్నాడన్నారు. 

తూర్పుగోదావరిజిల్లా సీతానగరంలో వరప్రసాద్ కు శిరోముండనం చేయించిన కవల కృష్ణమూర్తిని వైసీపీ ప్రభుత్వం ఏంచేసిందో, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. అమాయకులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో చూపే ఉత్సాహం, వైసీపీనేతలపై తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకుచూపడం లేదన్నారు. 

వైసీపీ మేనిఫెస్టోలో కీలకంగా వ్యవహరించిన నూతన్ నాయుడిని అరెస్ట్ చేయకుండా, తూతూమంత్రంగా అతని కుటుంబసభ్యులను, పనివాళ్లను అరెస్ట్ చేసిసరిపెడితే, అంబటి బుద్ధిలేకుండా మాట్లాడుతున్నాడన్నారు.  వయస్సు పెరిగినా సిగ్గులేకుండా ఆలోచన నశించినవాడిలా అంబటి మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. 

మనకు ఓట్లేసి, మనపార్టీ అధికారంలోకి వచ్చేలా చేసిన దళితులపై ఇలా దాడులుచేయడంసరికాదంటూ ఏనాడైనా అంబటిరాంబాబు జగన్ కు మంచి సలహాలు ఇచ్చాడా అని మాణిక్యరావు నిలదీశారు.  వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలతీరు చెప్పేది నీతివాక్యాలు – చేసేవి దుర్మార్గాలు అన్నట్లుగా ఉందన్నారు. దళితులపై ఈ ప్రభుత్వానికి వివక్ష లేకపోతే వరప్రసాద్ కు శిరోముండనం జరిగినప్పుడే చర్యలు తీసుకునేది.

అలా చేయకపోబట్టే  శ్రీకాంత్ కు శిరోముండనం జరిగింది? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయినవారికి కోటి రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలో ప్రమాదంలో చనిపోయిన దళితులకు రూ.5లక్షలిచ్చి సరిపెట్టింది. చనిపోయినవారికి ఇచ్చే పరిహారంలో కూడా వివక్ష చూపుతున్నది వైసీపీప్రభుత్వం కాదా? 

రాంబాబు లాంటి వాళ్లతో మాట్లాడాలంటే చిరాకు,  చీదర వేస్తోందన్న మాణిక్యరావు,  నీతిలేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా రాజకీయాలు చేస్తూ, విషపత్రికైన సాక్షిపేపర్ ని అడ్డం పెట్టుకొని, ప్రజలపై వైసీపీనేతలు విషం చిమ్ముతున్నారన్నారు. సత్తైనపల్లి నియోజకవర్గంలో భూపట్టాలకు సంబంధించి రూ.50వేలు వసూలుచేస్తున్నారని ఒకమహిళ సోషల్ మీడియాలో చెబితే అంబటి ఏం చేశాడన్నారు. 

అంబటికి దమ్ము, నిజాయితీ ఉంటే, తానుచేస్తున్న అవినీతిపై  సీబీఐ విచారణ జరిపించమని ఆయనే కోరాలని మాణిక్యరావు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో  దళితులపై ఏచిన్నఘటనా జరిగినా ఆనాటి పాలకులు వెంటనే స్పందించారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌తో చెల్లింపులు చేసేవారికి గుడ్ న్యూస్