Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : అంబటి రాంబాబు

Advertiesment
జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం : అంబటి రాంబాబు
, సోమవారం, 2 మార్చి 2020 (05:47 IST)
జగన్ కు ఎవరూ శత్రువులు లేరని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్ ని రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ కలవడం శుభపరిణామంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అభివర్ణించారు. 

అంబానీకి జగన్ కు కుదరదు కదా, ఆయన ఇక్కడికి రావడమేంటని, ఆయనకు జగన్ శాలువా కప్పడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, విషపూరిత మనస్తత్వంతో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

అంబానీ ఇక్కడికి రాకూడదని, ఏపీలో పెట్టబడులు పెట్టకూడదని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ తీసుకెళ్లినట్లు ఉంది: జగన్‌ పాలనపై కన్నా విసుర్లు