Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్ర‌బాబు జూమ్ బాబు .. చిన బాబు ట్విట్ట‌ర్ మాలోకం: అంబ‌టి రాంబాబు ఎద్దేవా

చంద్ర‌బాబు జూమ్ బాబు .. చిన బాబు ట్విట్ట‌ర్ మాలోకం: అంబ‌టి రాంబాబు ఎద్దేవా
, సోమవారం, 31 ఆగస్టు 2020 (18:49 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...
 
1. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ చాలా చిత్ర‌మైనటువంటి పార్టీగా త‌యారయ్యింది. తెలుగుదేశం అధినేత, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు మ‌రింత‌ వి‌చిత్రంగా త‌యార‌య్యాడు..
- చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసం బయటకు క‌ద‌ల‌డు.. ఆయన జూమ్ వ‌ద‌ల‌డు... ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం తీరు. 
 - ఆయ‌న‌కు తోడు వాళ్ల అబ్బాయి లోకేష్.. ట్విట్ట‌ర్ నుంచి బ‌య‌ట‌కు రాడు. ట్విట్ట‌ర్ లోనే మాట్లాడతాడు.
- మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ కు చాలా విచిత్ర‌మైన ప్ర‌తిప‌క్షం దాప‌రించింది. రోజూ జూమ్ ల్లో, ట్విట్టర్ లలో ఏదో ఒక విమ‌ర్శ‌లు చేయటం.. వాటిని వారి వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చేస్తున్నారు. 
 - ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వీరు నివ‌సించ‌రు. ఏపీలో నివాసులు కారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వీళ్ళు ప్ర‌వా‌సులు...
 
2. చంద్ర‌బాబు వ‌య‌‌స్సులో పెద్ద‌వారు, 70ఏళ్లు నిండాయి. క‌రోనా వ్యాధి దేశంలో విప‌రీతంగా ఉంది కాబ‌ట్టే, నేను నా ఇల్లు క‌ద‌ల‌ను అని ధైర్యంగా చెప్పండి చంద్ర‌బాబు గారూ..
 - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి కుమారుడు, మాజీ మంత్రివ‌ర్యులు, పార్టీ జాతీయ‌ సెక్ర‌ట‌రీగా ఉన్న వ్య‌క్తి, యువ‌కుడు అయిన లోకేష్ కూడా క‌ద‌ల‌డు.. మెదలడు.  కానీ వీరు ట్విట్ట‌ర్, జూమ్ ల‌లో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తారు. 
 - పెద్దాయ‌నేమో జూమ్ బాబు అయిపోతే.. చిన్న‌బాబు ఏమో ట్విట్ట‌ర్ మాలోకం అయిపోయాడు..
 
3. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్న‌ప్పుడు కూడా.. స్వ‌రాష్ట్రంలో నివసించ‌లేన‌టువంటి ఒక దౌర్భాగ్య‌మైన, నైతిక విలువలు లేని ప్ర‌తిప‌క్షం ఉండటం దుర‌దృష్టం.
 - తెలుగుదేశం పార్టీ విఫ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌లు మ‌ర్చిపోయిన ప్ర‌తిప‌క్షం, ప్ర‌జ‌ల‌కు దూర‌మైన ప్ర‌తిప‌క్షం. అయినా కూడా తమకున్న ఎల్లో మీడియాతో..  రెండు ప‌త్రిక‌లు, మూడు ఛానెల్స్ ‌స‌పోర్ట్ చేస్తూ.. ప్ర‌తిప‌క్షం ఇంకా ఉన్న‌ట్టుగా భ్ర‌మ క‌ల్పిస్తున్నారు.   - ప్ర‌తిప‌క్షం హైద‌రాబాద్ నుంచి కదలక‌పోయినా.. రాష్ట్రంలో విప‌రీత‌మైన అనర్థాలు జ‌రిగిపోతున్నాయ‌న్నట్టు విమ‌ర్శ‌లు చేసి ఫస్ట్  పేజీలలో వేసి ఇక్క‌డ ప్ర‌తిప‌క్షం ఉన్న‌ట్టుగా భ్ర‌మ క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారే త‌ప్ప.. వాస్తవానికి ఇక్క‌డ ప్రతిప‌క్షం చావుబ‌తుకుల్లో ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే ప్ర‌తిప‌క్షం బ‌తికే ఛాన్స్ కూడా లేదు. అయినా ప్ర‌తిప‌క్షానికి ఊపిరి పోసే ప్ర‌యత్నం ఎల్లో మీడియా చేస్తుంది. 
- ‌వాస్తవంగా రాష్ట్రంలో ఏ విధ‌మైన  ప్ర‌తిప‌క్షం లేదు.. కేవ‌లం జూమ్ లో మాత్ర‌మే క‌నిపిస్తుంద‌న్న న‌గ్న స‌త్యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించారు. 
- మీకు ధైర్యం ఉంటే.. వ‌చ్చి ప్ర‌జ‌ల మ‌ధ్య‌న నిలబడి నిర్మాణాత్మక ప్ర‌తిప‌క్షంగా వ్యవహరించాలి.
 
4. చంద్ర‌బాబు కాకుండా ఇంకేవ‌‌రైనా ఈ స‌మ‌యంలో హైదరాబాద్ లో ఉండి జూమ్ ల‌లో మాట్లాడితే ఇవే ఎల్లో మీడియా ప‌త్రిక‌లు ఏవిధంగా రాతలు రాసేవో ఒక్క ‌సారి ఆలోచించ‌మ‌ని మ‌న‌వి చేస్తున్నా. కాబ‌ట్టి ఓ వర్గం మీడియా పత్రిక‌ల్లో మాత్ర‌మే ప్ర‌తిప‌క్షం ఉంది త‌ప్ప ప్ర‌జ‌ల్లో లేనేలేదు. ఈ  ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారిని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శలు చేయ‌డం, ప్ర‌భుత్వం మీద  బుర‌ద చ‌‌ల్ల‌డం చేస్తున్నారు. రోజూ త‌ట్ట‌లుత‌ట్టలుగా బుర‌దచల్లి తుడుచుకోమ‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
 
5. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన సంవత్స‌రం మూడు మాసాల్లో చేసిన అనేక‌ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల గురించి ఒక్క‌టి కూడా ఈ ప‌త్రిక‌ల్లో రాయ‌రు. అలాగే, ప్రభుత్వం చేపడుతున్న అనేక విప్లవాత్మక కార్యక్రమాలలో చంద్ర‌బాబు నాయుడు ఏనాడూ కూడా ఫలానాది బాగుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌రు.
 - ప్రతిపక్షానికి స‌వాల్ చేస్తున్నాను. భార‌త‌దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి.. ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయా..? 

5 కోట్ల జ‌నాభా ఉన్న‌టువంటి మ‌న‌ రాష్ట్రంలో.. 5 కోట్లలో 4.5కోట్ల ప్ర‌జానీకానికి రూ.60వేల కోట్ల సంక్షేమ కార్య‌క్ర‌మాలు డైరెక్ట్ గా ల‌బ్దిదారుల ఖాతాల్లో ప‌డిన ప‌రిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితి  భార‌త‌దేశంలోని మరేతర రాష్ట్రంలోనైనా ఉందా ? - అక్క‌డ‌దాకా ఎందుకు.. చంద్ర‌బాబు నాయ‌డు గారు 40 సంవ‌త్స‌రాల ఇండ‌స్ట్రీ అంటారు, 14 సంవ‌త్స‌రాలు రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు, ఏ రోజైనా స‌రే ఇలాంటి  సంక్షేమ కార్య‌క్ర‌మాలు, 15 నెలల్లోనే రూ.60వేల కోట్లు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన సంద‌ర్భం ఒక్క‌టైనా ఉందా?  ధైర్యంగా చెప్పండి ?  చెప్పే ధైర్యం చంద్ర‌బాబుకు లేదు.
 
6. ప్రాజెక్టులు-కాంట్రాక్టులకు సంబంధించి.. రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం తెచ్చి, జ్యుడీషియ‌ల్ ప్రివ్యూ నిర్వహించి..ఈ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఒక నిబ‌ద్ధత‌తో ముందుకెళ్తున్నాం.
 - కాంట్రాక్టుల్లో ప్రజాధ‌నం దుర్వినియోగం కాకూడ‌ద‌నే స‌దుద్దేశంతో రివ‌ర్స్ టెండ‌రింగ్, జ్యుడీషియ‌ల్ ప్రివ్యూ పెడితే మొత్తం రూ. 14,286 కోట్లు పనులకుగాను, వాటిని రీటెండ‌రింగ్ చేసి రూ.4వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి ప్ర‌భుత్వానికి ద‌క్కుతుంది.  దీన్ని ఎల్లో మీడియాలో ఎక్క‌డా రాయేరేం?  
- ప్రజా ధనం రూ.4వేల కోట్లు ఆదా చేశామంటే..  సామాన్య‌మైన విష‌య‌మా? జ‌్యూడిషియ‌ర్ ప్రివ్యూ, రివ‌ర్స్ టెండ‌రింగ్ లేక‌పోతే రూ.4వేల కోట్లు తినేసేవారే క‌దా!
 - రూ.4వేల కోట్ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాకుండా, ఆదా చేసిన ప్ర‌భుత్వాన్ని కూడా పొగిడే ప‌రిస్థితి లేదు, ఈ ఎల్లో మీడియాకు. 
 - చంద్ర‌బాబు చెప్పినట్లు లేని బొక్క‌లను వెతికే ప్ర‌య‌త్నం ఈ ఎల్లో మీడియాది... ఏమి లేక‌పోయినా, ఏదో ఉన్న‌ట్టుగా చూపించే ప్ర‌య‌త్నం. కోడిగుడ్డు మీద ఈక‌లు పీకే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్ర‌బాబు, ఓ వర్గానికి చెందిన కొన్నిమీడియా సంస్థలు.
 
7. రాష్ట్రం అన్నాక చాలా చోట్ల వ్య‌క్తిగ‌త‌మైన ఘ‌ర్ష‌ణ‌లు, ఘటనలు జ‌రుగుతాయి. ఒకర్నొక‌రు కొట్టుకుంటారు.. దానికి  కూడా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చంద్రబాబు అంటున్నారు. 
 - మొన్న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన శిరోముండ‌నం కేసు విష‌యంలో కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి వైఫల్యం అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 
-  ఈ సంద‌ర్భంగా నేను ఒక్క‌టే మ‌న‌వి చేస్తున్నా.. రాష్ట్రంలో ఎవ‌రైనా ద‌ళితులు మీద దౌర్జ‌న్యం చేసినా,  అన్యాయం చేసినా,  అక్ర‌మాలు చేసినా వారిని నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తుందని నిరూపించిన‌ ప్ర‌భుత్వం ఇది. 
 - విశాఖలో శిరోముండనం ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే దానికి బాధ్యులైన‌ నూత‌న నాయుడి భార్య‌ని, మ‌రికొంత ‌మందిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం వీళ్ళ కంటికి కనిపించదా?  
 - తూర్పు గోదావరి జిల్లాలో.. ఒక ‌పోలీస్ అధికారి ద‌ళితుడికి శిరోముండ‌నం చేస్తే.. 48 గంటలు గడవక ముందే  సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానిది. 
 - ద‌ళితులు మీద ఎవ‌రైనా చేయి వేస్తే.. అన్యాయం చేసినా.. వారి తాట తీస్తామ‌ని సందేశాన్ని పంపిన ప్ర‌భుత్వం ఇది.
-  జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని ఈ ప్ర‌భుత్వం ద‌ళిత ప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం. అటువంటి ఈ ప్ర‌భుత్వంపైన బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.
 - చంద్ర‌బాబునాయుడు దళిత ద్రోహి. తెలుగుదేశం పార్టీ ద‌ళిత వ్య‌తిరేక పార్టీ. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఘటనలు జరిగాయి. ద‌ళిత వ్య‌తిరేక ప్ర‌భుత్వాలుగా వీళ్ళు ప‌రిపాల‌న చేశారు. 
- సాక్షాత్తు చంద్ర‌బాబు నాయుడే దళితుల్లో ఎవ‌రైనా పుట్టాలని అనుకుంటారా అని  మాట్లాడిన ప్ర‌బుద్దుడు. 
- దౌర్జ‌న్యాల‌కు నిల‌యమైన పార్టీ తెలుగుదేశం. తహసీల్దార్ వ‌న‌జాక్షి మీద టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే.. రాజీ చేశారే త‌ప్ప కే‌సు పెట్టి అరెస్ట్ చేశారా? 
 
నచ్చిన మద్యం బ్రాండ్లు ఎందుకు అమ్మరని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షం..
8. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, అధికారులైనా, ఎవ‌రైనా సరే.. ప్రజలపై దౌర్జ‌న్యం చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటున్న ఈ ప్ర‌భుత్వంపై ఏదో విధంగా బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్ర‌బాబు.
 - ఈ ప్ర‌తిప‌క్షం ఎంత‌గా దిగ‌జారిపోయిందంటే.. మ‌ద్యం విష‌యంలో వారికి న‌చ్చిన‌టువంటి బ్రాండ్స్ మాత్ర‌మే అమ్మాల‌ని డిమాండ్ చేసే నీచ‌మైన‌ స్థాయికి దిగ‌జారిపోయింది తెలుగుదేశం పార్టీ 
 - దశలవారీగా మ‌ద్య‌పాన ని‌షేధం దిశ‌గా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. మాకు ఫ‌లానా మద్యం బ్రాండ్లు కావాలి, అవే అమ్మాలి, ఇంకోటి అమ్మ‌డానికి వీల్లేద‌నేటువంటి ద‌శ‌కు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం దిగజా‌రిపోయింది" అని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్కా కాంగ్రెస్ వాది ... అయినా అందరివాడు 'భారతరత్న' ప్రణబ్ మఖర్జీ