Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌తో చెల్లింపులు చేసేవారికి గుడ్ న్యూస్

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌తో చెల్లింపులు చేసేవారికి గుడ్ న్యూస్
, సోమవారం, 31 ఆగస్టు 2020 (18:52 IST)
మొబైల్ వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపులు చేసేవాళ్లకి శుభవార్త. జనవరి 2020 నుండి యుపిఐ లావాదేవీలపై విధించిన రుసుమును తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ బ్యాంకులను ఆదేశించింది. భీమ్‌-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌.. తదితరాలు ఉపయోగించి డిజిటల్‌ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై వినియోగదారులకు ఈ వెసులుబాటు దక్కుతుంది. 
 
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఈ మేరకు సర్యులర్‌ జారీ చేసింది. ఈ డిజిటల్‌ చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని తేల్చి చెప్పింది. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్‌ యాక్ట్‌-2019లో సెక్షన్‌ 269 ఎస్‌యూ చేర్చింది. 
 
ఫలితంగా భీమ్‌-యూపీఐ, రూపే-డెబిట్‌కార్డ్‌, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీలను ఈ సెక్షన్‌ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయకూడదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజాగా ఈ సర్క్యులర్‌ను జారీచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు జూమ్ బాబు .. చిన బాబు ట్విట్ట‌ర్ మాలోకం: అంబ‌టి రాంబాబు ఎద్దేవా