Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూతుల మంత్రికి ఒళ్లు కొవ్వెక్కింది: కొడాలి నానిపై దేవినేని ఫైర్

Advertiesment
బూతుల మంత్రికి ఒళ్లు కొవ్వెక్కింది: కొడాలి నానిపై దేవినేని ఫైర్
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:03 IST)
వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ‘రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో 1029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసమర్థ, చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం. ఇంతవరకు రాయలసీమ చెరువులు నింపలేదు. పోలవరం ముంపు మండలాలను గాలికొదిలేసి నిర్వాసితులను నీళ్లపాలు చేశారు.

సున్నా వడ్డీ పథకం కింద రైతులు రుణాల కోసం రూ.800 కోట్లు కడితే వారికి రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదు బదిలీ పథకం అంటున్నారు. సున్నా వడ్డీ రుణం పథకంలో ఏ విధంగా రైతుల్ని మోసం చేశారో అదే విధంగా రేపు విద్యుత్ బకాయిలు ముందు చెల్లిస్తేనే తాము సబ్సిడీ ఇస్తామని మెలికపెడతారు. రూ.10 వేల కోట్ల రుణం కోసం విద్యుత్ వాడకానికి మీటర్లు బిగించడం ద్వారా రైతులను నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుంది’ అని ధ్వజమెత్తారు.
 
కొడాలి బూతుల మంత్రి..
‘చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్షతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుటి ప్రభుత్వంలో బూతుల మంత్రిగా ఉన్న వ్యక్తి ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. తాడేపల్లి రాజప్రసాదానికి నెలనెలా జేట్యాక్స్ కట్టే వ్యక్తికి చంద్రబాబు, ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. లారీ డ్రైవర్లు, బస్ క్లీనర్లు సంస్కారంగా మాట్లాడతారు గానీ, కొడాలినానిలా సంస్కారహీనంగా బూతులు మాట్లాడరు.

జగన్ ఆనందం కోసం టీడీపీ వాళ్లను తిట్టడం మానేసి.. గుడివాడలో పేకాట ఆడించే కేంద్రాలను మూసేయిస్తే మంచిది. వసంత కృష్ణప్రసాద్ 1999లో నాపై పోటీచేసి ఓటమి పాలై హైదరాబాద్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. కృష్ణప్రసాద్ అతని కుటుంబం ఎక్కడున్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సీబీఐ, ఈడీ కేసుల్లో వసంత కృష్ణప్రసాద్ ముద్దాయిగా ఉన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో అతను కూడా ఒకడు. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు వివరాలను కృష్ణప్రసాద్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. అటువంటి వ్యక్తి సిగ్గులేకుండా శ్రీరంగ నీతులు చెబుతున్నారు. కేంద్రజలశక్తి శాఖే పోలవరం, పట్టిసీమల్లో ఎటువంటి అవినీతి జరగలేదని స్పష్టంచేసింది. ఇది తెలిసికూడా కొందరు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ వేల ట్రిప్పుల గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. దాన్ని అడ్డుకున్నాననే నాపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని దేవినేని ఉమ మండిపడ్డారు.
 
‘ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని ఏసీబీ దాడులతోనే తేలిపోయింది. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై రెండు రోజులుగా ఏసీబీ దాడులు జరుగుతున్నందుకు కృష్ణప్రసాద్ సిగ్గుపడాలి.  అతని అవినీతి వల్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ సూపరిండెంట్ బలికాబోతున్నారు.

వసంత, అతని బావమరిది ముంపు భూములు కొని వాటిని మెరకచేయడం కోసం అటవీభూమిని కొల్లగొట్టారు. సజ్జా అజయ్‌పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలే. తాడేపల్లి రాజప్రసాదానికి వస్తా..రా.  నీ అవినీతిపై తేల్చుకుందామంటే కృష్ణప్రసాద్ పత్తాలేడు.

జగన్.. కృష్ణప్రసాద్ అవినీతిని పసిగట్టి ఏసీబీని వదిలాడన్న నిస్పృహతో  ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కృష్ణప్రసాద్ బంధువు టీచర్ పొదిల రవి హత్య కేసు విచారణ కూడా సీబీఐకి అప్పగించాలి’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు