Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలాసేపు తిరుమల శ్రీవారి గుడిలో కిషన్ రెడ్డి? సామాన్య భక్తుల ఆగ్రహం..?

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:29 IST)
కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కిషన్ రెడ్డి తిరుపతికి వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
 
సుమారు గంటకుపైగా ఆలయంలోనే కేంద్రమంత్రి ఉన్నారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను కేంద్రమంత్రి అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
 
రాజకీయాలు తిరుమలలో వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తూ వెళ్ళిపోయారు. భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఉంటే కేంద్రమంత్రి చాలాసేపు ఆలయంలో వుండటం పలు విమర్శలకు తావిస్తోంది. 
 
కేంద్ర మంత్రి ఇలా చేస్తే ఎలా అంటూ సామాన్య భక్తులు వాపోయారు. కేంద్రమంత్రి ఆలయంలోకి వస్తున్నారని తెలియగానే కొద్దిసేపు ముందుగానే దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. దీంతో వీఐపీ దర్శనం తర్వాత శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సిన సామాన్య భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments