Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే లీటరు పెట్రోల్ రూ.32కే లభిస్తుందట.. ఏంటో ఆ చిదంబర రహస్యం!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:19 IST)
దేశంలో చమురు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న ఈ పెట్రోల్, డీజల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరల పెరుగదల కారణంగా నిత్యావసర వస్తు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ విత్తమంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై విధిస్తున్న సెస్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. 
 
సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని ఆరోపించారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్‌లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్‌లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ.32కే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
అలాగే, దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ  ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే, అమలులో కొంత వైఫల్యం చెందారని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును చేపట్టారని... అయితే నల్లధనం ఉన్నవారు వారి డబ్బును వివిధ రకాలుగా వైట్‌గా మార్చుకున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments