Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతి... కుటుంబం నివాళి

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:43 IST)
మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 9వ వర్దంతిని ఆ కుటుంబం ఘ‌నంగా నిర్వ‌హించింది. టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మలి మండలం, నిమ్మాడలోని ఎర్ర‌న్నాయుడు స్వగ్రామంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
 
 
కింజరాపు ఎర్రన్నాయుడు గారి 9వ వర్దంతి సందర్భంగా ఆయ‌న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఎర్రన్నాయుడు సతీమణి విజయకుమారి క‌న్నీళ్ళ ప‌ర్యంతం అయ్యారు. ఆమె కుటుంబ సమేతంగా టెక్కలి నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు హరివరప్రసాద్, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని  ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.


వారితో పాటు జిల్లాలోని ముఖ్య నాయుకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాలు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జోహార్ జోహార్ కింజరాపు ఎర్రన్నఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments