Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేల్ లో వైసీపీ ఘ‌న విజ‌యం... ఎమ్మెల్యే గా డాక్టర్ సుధా

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (12:33 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేగా డాక్ట‌ర్ సుధ ఎన్నిక‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట్లు.. 1,46,545. ఇందులో వైసీపీకి 1,11,710 ఓట్లు పోల‌య్యాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్య‌ర్థి సురేష్ కు 21,621 వ‌చ్చాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థిని మాజీ ఎమ్మెల్యే క‌మ‌ల‌మ్మ‌కు 6,205 ఓట్లు వ‌చ్చాయి. నోటాకి 3,629 ఓట్లు ప‌డ‌టం ఇక్క‌డ విశేషం.
 
 
మొత్తం మీద బ‌ద్వేలులో వైసీపీకి ఫైనల్ మెజారిటీ 90,228 ఓట్లు వ‌చ్చాయి. బద్వేలు బైపోల్ ఫలితాలు ఎవ‌రికీ పెద్ద ఆశ్చ‌ర్యాన్ని ఉత్కంఠ‌ను క‌లిగించ‌లేదు. ఇక్క‌డ వైసీపీ గెలుస్తుంద‌ని అంద‌రికీ తెలుసు. అయితే, మెజారిటీ ఎంత వ‌స్తుంద‌నేది ఊహాగానాలు న‌డిచాయి. మాజీ ఎమ్మెల్యే చ‌నిపోవ‌డంతో ఆయ‌న భార్య డాక్ట‌ర్ సుధ‌కు వైసీపీ టిక్కెట్ ప్ర‌క‌టించింది. సంప్ర‌దాయంగా వ‌స్తున్న రాజకీయ ఆచారంగా తాము చ‌నిపోయిన ఎమ్మెల్యే భార్య‌కు సీటు ఇచ్చారు కాబ‌ట్టి, పోటీ నుంచి వైదొల‌గుతున్నామ‌ని తెలుగుదేశం, జ‌న‌సేన ప్ర‌క‌టించాయి. దీనితో వైసీపీకి విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క అయింది. కానీ, మ‌రో ప‌క్క కాంగ్రెస్, బీజేపీలు తాము మాత్రం బ‌రిలో ఉంటామ‌ని చెప్ప‌డంతో అంతా అవాక్క‌య్యారు. సునాయాసంగా గెలిచే వైసీపీకి ఎదురు వీరెందుకు నిల‌బ‌డుతున్నార‌నే అనుమానాలు వ్య‌క్తం అయ్యయి. అంతా అనుకున్న‌ట్లే, జాతీయ పార్టీల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. వైసీపీ ఇక్క‌డ మ‌రోసారి ఘ‌న‌విజ‌యాన్ని సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments