Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఇంటి ఎదురుగా సీసీ కెమేరా...కాకినాడ మేయ‌ర్ పావ‌ని అస‌హ‌నం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:37 IST)
కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పదవికి తాను రాజీనామా చేయనని, అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేయర్ సుంకర పావని తెలిపారు. తన ఇంటి ఎదురుగా వ్యక్తిగత  స్వేచ్ఛను హరించే సీసీ కెమెరా ఏర్పాటు చేయడం పట్ల పావని అసహనం వ్యక్తం చేశారు.
 
మేయర్ పావని తన ఇంట్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరంలో ఎన్నో స్లమ్ ఏరియాలు ఉన్నాయని అటువంటి చోట్ల ఏర్పాటు చేయకుండా, సీసీ కెమెరాను తాను ఉంటున్న ఇంటికి ఎదురుగా వేయించడం తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనన్నారు. తనను రెండేళ్ల నుండి స్థానిక ప్రజా ప్రతినిధి ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ పరోక్షంగా సిటీ ఎమ్మెల్యే పేరు చెప్పకుండా వివరించారు.
 
గత నెల రోజులుగా త‌నపై వేధింపులు పెరిగాయని, మహిళా అని చూడకుండా ఆ ప్రజా ప్రతినిధి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానన్నారు. తనకు ప్రజాధారణ అధికంగా ఉందని, ఈ విషయం అవిశ్వాస పరీక్షలలో  తెలుస్తుందన్నారు. అనంతరం ఆమె త‌న ఇంటి ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను విలేఖర్లకు చూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments