Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్‌తో బైక్ రైడ్.. వీళ్లకు రూల్స్ లేవా.. యాంకర్‌పై ఫిర్యాదు..

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్‌ (కె.ఎ. పాల్‌)కి ఎంత క్రేజ్ లభిస్తూందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు ఆయనను పలు రకాలుగా ఇంటర్వ్యూ చేసేందుకు పోటీ పడుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కి చెందిన యాంకర్ ఆయనని భిన్నంగా ఇంటర్వ్యూ చేసే క్రమంలో భాగంగా, పాల్‌‍ని స్కూటర్‌ వెనుక సీటులో కూర్చోబెట్టేసుకుని ప్రయాణించారు. 
 
అయితే... ఈ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ హెల్మెట్ పెట్టుకోలేదు. దీంతో కార్తీక్ అనే ట్విట్టర్ యూజర్ ఆ యాంకర్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ... ‘‘సర్, టీవీ యాంకర్ కేఏ పాల్‌తో కలిసి హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతోంది. వీళ్లకు రూల్స్ లేవా’’ అంటూ ఫొటోను ట్వీట్ చేసాడు. 
 
అయితే, ఆమె పాల్‌ను ఇంటర్వ్యూ చేసిన ప్రాంతం హైదరాబాద్‌లోనిది కాకపోవడంతో... దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు విజయవాడ ట్రాఫిక్ పోలీసులను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. మరి దీనిపై విజయవాడ పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 
 
మరి పెద్ద పెద్ద దేశాల మధ్య యుద్దాలే ఫోన్‌లు చేసి ఆపించేసిన పాల్‌గారు ఈ ట్విట్టర్‌లు, ఫైన్‌లు కూడా ఆపించేస్తే... బాగుండేదేమో మరి..  పాల్‌గారి ఇంటర్వ్యూ పుణ్యమా అని యాంకర్‌గారి ఫైన్‌లు పడేట్లున్నాయి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments