Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాయావతి సపోర్ట్‌తో కింగ్ అవుతానంటున్న జనసేనాని.. ఎలా?

మాయావతి సపోర్ట్‌తో కింగ్ అవుతానంటున్న జనసేనాని.. ఎలా?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:31 IST)
బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో కలిసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తరువాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు దశ తిరుగుతోందట.

ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒంటరిగానే రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. కానీ గత వారం రోజుల నుంచి బిఎస్పీ అధినేత్రిని వెంటపెట్టుకుని మరీ తన పర్యటనలను కొనసాగిస్తున్నారు. నిన్నటికి నిన్న వైజాగ్, నేడు తిరుపతి ఇలా సరికొత్త ప్రచారం చేస్తూ ఎన్నికల యుద్థభేరి పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత మొదటగా బిజెపి, టిడిపికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఆ తరువాత తెలుగుదేశంతో పాటు మిగిలిన పార్టీలపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే తన ఒక్కడి వల్ల అది సాధ్యం కాదని, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనసేన పార్టీకి ఉపయోగం ఉంటుందని భావించారు పవన్ కళ్యాణ్. అందుకే బిఎస్పీ అధినేత్రిని కలిసి పొత్తు పెట్టుకున్నారు.
 
పవన్ కళ్యాణ్ లాంటి యువనాయకుడు రావడంతో జనసేన పార్టీతో మాయావతి కూడా పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. మోడీపై ఉన్న కోపం, పవన్ కళ్యాణ్ దూకుడు నచ్చి మాయావతి జనసేన పార్టీకి బాగా దగ్గరయ్యారు. ఎస్సి, ఎస్టి, వెనుకబడిన తరగతుల కులాల వారు మొత్తం బిఎస్పీ పార్టీ వైపు ఉండటంతో ఎపిలో ఆ సామాజికవర్గం నేతలు కూడా ఉండటంతో బాగా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు పవన్ కళ్యాణ్.

ఎక్కడ సభ జరిగినా గతంలో కన్నా ప్రస్తుతం మాయావతిని చూసేందుకు భారీగా జనం తరలి వస్తుండటంతో పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషంతో ఉన్నారు. ఖచ్చితంగా ఎపి రాజకీయాల్లో కింగ్ అవుతామన్న నమ్మకంతో ఉన్నారట పవన్ కళ్యాణ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయా... జస్టిస్ ఈశ్వరయ్య