అహ్మద్ పటేల్‌కి ఫోన్ చేసి జగన్ సీఎం కాకుండా చెడగొట్టింది నేనే... కె.ఎ పాల్

గురువారం, 4 ఏప్రియల్ 2019 (20:26 IST)
2009లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చెడగొట్టింది తానేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ చెప్పారు. జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయొద్దని నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌కు ఫోన్ చేసి మరీ చెప్పాననీ, దాంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి రాకుండా పోయిందన్నారు. అలాగే రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని కూడా తానే సూచన చేశాననీ, ఆ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోశయ్యను ఏపీ ముఖ్యమంత్రిగా చేసిందని గుర్తు చేశారు.
 
ఎన్నికల వేళ కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు ఒకింత ఆసక్తికరంగా వుంటున్నాయి. కె.ఎ పాల్ మాట్లాడుతూ... ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తాను. ఐతే నా సెక్యూరిటీపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. సెక్యూరిటీ కావాలని అడిగితే ఒక్క పోలీసును ఇచ్చారు. మరి గతంలో వందలమంది పోలీసులను ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క పోలీసును ఎందుకు అంటూ ప్రశ్నించారు.
 
పులివెందుల క్యాండిడేట్‌కి వైఎస్సార్సిపి నాయకులు నరకం చూపిస్తున్నారు. మేం గెలిస్తే ప్రధాన పార్టీలు పని అయిపోతుందని భయపడుతున్నారు. కొంచెం పవర్ ఇవ్వండి... తొక్క తీస్తా. ఒక్కొక్కడికి గుండు గీయిస్తా. పవర్ లేకపోతేనే నేనిలా వున్నా. ఇచ్చి చూడండి ఇంకెలా వుంటానో'' అంటూ చప్పట్లు కొట్టి మరీ చెప్పారు కె.ఎ పాల్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం మాయావతి సపోర్ట్‌తో కింగ్ అవుతానంటున్న జనసేనాని.. ఎలా?